అద‌రగొడుతున్న ‘హ‌లో’

0

అక్కినేని అఖిల్‌ను రీలాంచ్‌ చేస్తూ దర్శకుడు విక్రమ్‌ కే కుమార్‌ తెరకెక్కించిన సినిమా ’హలో’… ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్‌ రివ్యూలు వచ్చాయి. ప్రేక్షకుల నుంచి కూడా మంచి టాక్‌ వినిపిస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో, అటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా డీసెంట్‌ కలెక్షన్లు రాబడుతున్నదని సమాచారం. ‘హలో’ సినిమాకు మంచి టాక్‌ సొంతమై విజయవంతంగా నడుస్తున్న నేపథ్యంలో చిత్ర హీరో అఖిల్‌ తాజాగా ట్విట్టర్‌లో స్పందించారు. ‘మా చిత్రం పట్ల ప్రేమాభిమానాలు చూపుతున్నందుకు ధన్యవాదాలు. మీ ప్రశంసలు మాకు ఎంతో విలువైనవి. ఇందుకు చిత్రయూనిట్‌ మొత్తం కృతజ్ఞతలు తెలుపుతోంది’ అని అఖిల్‌ ట్వీట్‌ చేశాడు. అమెరికా బాక్సాఫీస్‌ వద్ద రెండురోజుల్లోనే అరమిలియన్‌ డాలర్ల మార్క్‌ను ఈ చిత్రం దాటిందంటూ ఓ పోస్టర్‌ను పెట్టారు. నాగార్జున తెరకెక్కించిన ఈ సినిమాలో అఖిల్‌ సరసన కల్యాణీ ప్రియదర్శన్‌ నటించి.. తొలిసారి చిత్రసీమలోకి అడుగుపెట్టింది. కల్యాణీ.. నటి లిజీ-దర్శకుడు ప్రియదర్శన్ కూతురు.

Share.

Leave A Reply

%d bloggers like this: