అఫ్రిదిపై జంతు ప్రేమికుల ఆగ్ర‌హం

0

పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది ట్విటర్‌లో షేర్‌ చేసిన ఒక పోస్ట్‌ జంతుప్రేమికుల ఆగ్రహానికి గురైంది. ‘జంతువులను రక్షించడం మర్చిపోకండి, వాటికి మన ప్రేమ ఎంతో అవసరం ఉందంటూ’ జింకకు పాలు తాగిస్తూ దిగిన ఫోటో, తన కూతురు ఫోటోను బూమ్‌ బూమ్‌ ఆఫ్రిది షేర్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఆల్‌రౌండర్‌ షేర్‌ చేసిన ఫోటోలో తన కూతురుతో పాటు ఆమె వెనకాలా ఓ పెద్ద సింహాన్ని గొలుసుతో కట్టేసి ఉంచారు. దీనిపై ఆగ్రహించిన జంతు ప్రేమికులు స్వేచ్చగా అడవిలో తిరగాల్సిన సింహాన్ని ఇలా గోలుసులతో కట్టిపడేస్తే జంతువులను ప్రేమించటం కాదని ఘాటుగా స్పందించారు. ఇక మరికొందరు క్రూర జంతువులను ఇళ్లలో పెంచుకోవడం చట్టవిరుద్దమని ఆఫ్రిదిని కడిగిపాడేశారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఆఫ్రిది ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

Share.

Leave A Reply

%d bloggers like this: