అమెరికాలో మ‌రో భార‌తీయుడి కాల్చివేత‌

0

అమెరికాలో భారత సంతతి విద్యార్థి అర్షద్‌ వోహ్రా(19)ను దోపిడీ దొంగలు కాల్చిచంపారు. షికాగోలోని డాల్టన్‌ పరిధిలోని క్లార్క్‌ స్టోర్ ప్రాంతంలో ఉన్న ఓ గ్యాస్‌ స్టేషన్‌ లో పనిచేస్తున్న వోహ్రాను, దొంగతనం చేసేందుకు అక్కడికి వచ్చిన సాయుధులు కాల్చిచంపినట్లు పోలీసు అధికారులు తెలిపారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వోహ్రా స్నేహితుడు, హైదరాబాద్ కు చెందిన బకర్‌ సయీద్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వోహ్రా తన తండ్రికి బదులుగా గ్యాస్‌ స్టేషన్‌ లో పని చేసేందుకు వచ్చాడని, నిందితుల ఆచూకీ తెలిపిన వారికి 12వేల డాలర్ల రివార్డును అందజేస్తామని పోలీసులు తెలిపారు. గాయపడిన బకర్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి.

Share.

Leave A Reply

%d bloggers like this: