అమ్మాయిల‌కూ ఐపీఎల్

0

మహిళా క్రికెటర్లకు ఐపీఎల్‌ నిర్వహించాలన్న ప్రతిపాదన దిశగా చిన్న అడుగు పడింది. ఈ నెల 22న ముంబయిలో ఐపీఎల్‌ ప్లేఆఫ్‌కు ముందు ప్రయోగాత్మకంగా మహిళలకు ఎగ్జి బిషన్‌ టీ20 మ్యాచ్‌ను నిర్వహించనుంది బీసీసీఐ. ఈ మ్యాచ్‌ కోసం 20 మంది భారత మహిళా క్రికెటర్లతో పాటు పది మంది విదేశీయులు సాధన చేయబోతున్నారు. వీరి నుంచి రెండు జట్లను తయారు చేస్తారు. ఒక జట్టు ఐపీఎల్‌ ఎలెవన్‌ కాగా.. మరొకటి బీసీసీఐ ఎలెవన్‌. ఐపీఎల్‌లో మాదిరే ఒక్కో జట్టులో ఏడుగురు భారతీయులు, నలుగురు విదేశీ యులు ఉంటారు. 22న మధ్యాహ్నం 2.30 నిమిషాలకు ఈ మ్యాచ్‌ ఆరంభమ వుతుంది. స్టార్‌ స్పోర్ట్స్‌ ఈ మ్యాచ్‌ను ప్రసారం చేయనుంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ బోర్డుల్ని సంప్రదించి ఈ మ్యాచ్‌లో పాల్గొనే విదేశీ క్రికెటర్ల పేర్లను బీసీసీఐ ప్రకటించనుంది. భారత అమ్మాయిల వివరాలను సెలక్షన్‌ కమిటీ వెల్లడిస్తుంది.

Share.

Leave A Reply

%d bloggers like this: