ఆటోను ఢీకొన్న బ‌స్సు..ఐదుగురు మృతి

0

మృతుల్లో న‌లుగురు విద్యార్థులు, ఆటో డ్ర‌యివ‌ర్‌
గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో విషాదం నెలకొంది. విద్యార్ధులను పాఠశాలకు తీసుకెళుతున్న ఆటోను ఆర్టీసీ బస్సు గురువారం ఉదయం ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న నలుగురు విద్యార్ధులు, ఆటో డ్రైవర్ మృతిచెందగా మరో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వేమవరం గ్రామం నుంచి పేరేచర్లలో పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్ధులు ఆటో ఎక్కారు. అయితే… వీరు ప్రయాణిస్తున్న ఆటోలను ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామం వద్ద పొన్నూరు నుంచి శ్రీశైలం వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ఆటోలోని నలుగురు పదో తరగతి విద్యార్ధులు, ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని గుంటూరులోని జీజీహెచ్‌కు తరలించారు. ఆటోలో మొత్తం ఏడుగురు విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. సంఘటనాస్థలాన్ని గుంటూరు జిల్లా ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీహరి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share.

Leave A Reply

%d bloggers like this: