ఆస్ట్రేలియాలో తెలుగు టెకీ అనుమానాస్ప‌ద మృతి

0

ఆస్ట్రేలియాలో తెలంగాణవాసి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కోన ఆదినారాయణ రెడ్డి(33) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఉద్యోగం కోసం ఆరు నెలల కిందట సిడ్నీ వెళ్లిన కోన ఆదినారాయణ రెడ్డి ఇన్ఫోసిస్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో మొన్న(ఆదివారం) సాయంత్రం చివరిసారిగా మిర్యాలగూడలో ఉంటున్న భార్య శిరీషతో మాట్లాడాడు. ఆ తర్వాత ఎవరు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేకపోవడంతో రూమ్ కి వెళ్లి చూడాలని మిత్రులను కుటుంబ సభ్యులు కోరారు. ఇంటికి వెళ్లిన మిత్రులకు ఆదినారాయణ విగతజీవిగా కనిపించాడు. భర్త మరణవార్త వినగానే శిరీష కుప్పకూలిపోయినట్లు సమాచారం. ఆదినారాయణ మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. శిరీష-ఆదినారాయణకు మూడేళ్ల కవల పిల్లలున్నారు. ఆదినారాయణ మృతదేహాన్ని తీసుకురావడంతో పాటు అతడి మృతిపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Share.

Leave A Reply

%d bloggers like this: