ఏం నాయ‌నా ల‌డ్డూ కావాలా..!

0

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం షాక్ ఇచ్చింది. స్వామివారి ప్రసాదం ధరలను టీటీడీ భారీగా పెంచేసింది. 25 రూపాయలున్న సాధారణ లడ్డు ధర … వంద రూపాయలకు, వంద ఉన్న‌ కళ్యాణం లడ్డు ధర, 200ల రూపాయలకు, అదనంగా కేటాయించే లడ్డులపై వంద శాతం ధరను టీటీడీ పెంచేసింది. అదే విధంగా 25 రూపాయలున్న వడ ధరను వందకు పెంచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు సమాచారం లేకుండా…. పెంచిన ధరలను అధికారులు నేటి నుంచి అమలు చేసేశారు. దీనిపై భ‌క్తులు విచారం వ్య‌క్తం చేస్తున్నారు. సామాన్యుల‌కు శ్రీ‌వారి ప్ర‌సాదం దూరం చేస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Share.

Leave A Reply

%d bloggers like this: