ఏప్రిల్‌లో శ్రీ‌వారి ఆదాయం 87.27 కోట్లు

0

ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.87.27 కోట్లు లభించినట్టు టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. గతేడాది ఏప్రిల్‌లో హుండీ ఆదాయం రూ.79.32 కోట్లు లభించిందన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ఈ వివరాలను తెలియజేశారు. 2017 ఏప్రిల్‌లో 23.15 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఈ ఏడాది ఏప్రిల్‌లో 21.40 లక్షల మంది దర్శించుకున్నారు. గతేడాది ఏప్రిల్‌లో 87.44 లక్షల లడ్డూలను భక్తులకు అందించగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 91.60 లక్షల లడ్డూలను అందించడం జరిగింది. గతేడాది ఏప్రిల్‌లో 53.02 లక్షల మందికి అన్నప్రసాదాలు అందించగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 52.09 లక్షల మందికి అందించారు. గతేడాది ఏప్రిల్‌లో 34.84 లక్షల మందికి పానీయాలు అందించగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 32.42 లక్షల మందికి అందించారు. గతేడాది ఏప్రిల్‌లో 10.70 లక్షల మంది తలనీలాలు సమర్పించగా ఈ ఏడాది ఏప్రిల్‌లో 9.26 లక్షల మంది సమర్పించారు.

Share.

Leave A Reply

%d bloggers like this: