ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

0

తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లాలోని రాజాపేట మండలం పాముకుంటలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వివరాలివి.. జగదేవ్‌పూర్‌కి చెందిన దంపతులు గత కొద్ది రోజులుగా పాముకుంటలో నివాసం ఉంటున్నారు. వీరి కుటుంబం ఇక్కడే కోళ్ళఫారంలో కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. మృతుల్లో నలుగురు పెద్దవాళ్లు, ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను వృద్ధదంపతులు బైండ్ల బాలనర్సయ్య, భారతమ్మ, కూతురు తిరుమల, అల్లుడు బాలరాజు సహా, చిన్నారులు శ్రావణి, చింటూ, బన్నీలుగా గుర్తించారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Share.

Leave A Reply

%d bloggers like this: