కేర‌ళ సీఎం మ‌మ్ముట్టి..!?

0

దాదాపు 26 సంవ‌త్స‌రాల త‌ర్వాత మలయాళ హీరో మమ్ముట్టి మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి రంగం సిద్ధం అవుతోందని మాలీవుడ్‌ సమాచారం. మమ్ముట్టి ఏంటి? సీఎం ఏంటి? అనుకుంటున్నారా? మేం చెబుతున్నది ఆయన రియ‌ల్ లైఫ్ గురించి కాదు. రీల్‌ లైఫ్‌ గురించి మాత్రమే. 1991లో కేరళ పొలిటీషియన్‌ జి. కార్తీ కేయన్‌ కథ ఆధారంగా బాలచంద్ర మీనన్‌ దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన సినిమా ‘నాయాం వ్యక్తమక్కున్ను’.ఆ సినిమాలో మమ్మట్టి ముఖ్యమంత్రి పాత్ర చేశారు. ఇప్పుడు సంతోష్‌ విశ్వనాథన్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో మమ్ముట్టి మళ్లీ ముఖ్యమంత్రిగా నటించబోతున్నారన్న వార్తలు మాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ‘నాయాం వ్యక్తమక్కున్ను’లో మమ్ముట్టి సీఎంగా కనిపించడం ఆయన అభిమానులను అలరించింది. సీఎంగా ఈ సూపర్‌ స్టార్‌ విజృంభించారు. మళ్లీ ఆ పాత్రలో ఆయన కనిపిస్తే అభిమానులకు పండగే.

Share.

Leave A Reply

%d bloggers like this: