క్యూలో ఉన్న‌వారికే వైకుంఠ ద్వార‌ద‌ర్శ‌నం

0

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ద్వాదశిని పురస్కరించుకుని శనివారం కూడా భక్తులు వైకుంఠ ద్వార దర్శనానికి క్యూలైన్‌లలో బారులు తీరారు. అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో తాత్కా‍లిక షెడ్లలోని క్యూలైన్లలో కూడా భక్తులు వేచి ఉండాల్సి వస్తోంది. శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. శుక్రవారం రాత్రి నుంచి క్యూలైన్‌లో ఉన్నవారికి మాత్రమే ఈరోజు అర్ధరాత్రి వరకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. శనివారం వ‌చ్చే భక్తులకు రేపు దర్శనభాగ్యం ఉంటుంది. కాగా తిరుమలలో గదులు దొరకక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. టీటీడీ సామాన్య భ‌క్తుల‌కు వ‌స‌తులు, ద‌ర్శ‌నాలు స‌క్ర‌మంగా క‌ల్పించ‌డంలో విఫ‌ల‌మైంద‌ని భ‌క్తులు మండిప‌డుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చంటిబిడ్డ‌లు త‌ల్లులు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.

Share.

Leave A Reply

%d bloggers like this: