క‌మెడియ‌న్ చ‌లాకి చంటికి త‌ప్పిన ప్ర‌మాదం

0

‘జబర్దస్త్’ కమెడియన్ చలాకి చంటికి మంగళవారం పెను ప్రమాదం తప్పింది. మహబూబ్‌ నగర్‌ జిల్లా బాలానగర్‌ మండల కేంద్రం 44వ జాతీయ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. కాగా అదృష్టవశాత్తూ ఈ ప్ర‌మాదం నుంచి చంటి సురక్షితంగా బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్వల్ప గాయాలైన చంటికి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share.

Leave A Reply

%d bloggers like this: