గంజాయి ముఠా అరెస్టు

0

ఒడిశా నుంచి ఆంధ్రా మీదుగా మహరాష్ట్రకు అక్రమంగా కారులో గంజాయిని రవాణా చేస్తున్న అంతర్‌ రాష్ట్ర గంజాయి ముఠాను గంజాం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ అయిన వారి నుంచి కారు, 244 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని దిగపండి పోలీస్‌స్టేషన్‌లో శనివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కె.నువగాం పోలీస్‌స్టేషన్‌ ఐఐసీ అధికారి సుజిత్‌ నాయక్‌ మాట్లాడుతూ గంజాం, గజపతి జిల్లాల సరిహద్దుల్లో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయిని హైదరాబాద్‌ నుంచి అద్దెకు తీసుకున్న కారులో 244 కిలోల గంజాయి ప్యాకెట్‌లను ఎక్కించుకుని ఒడిశా-ఆంధ్రా మీదుగా మహరాష్ట్రకు తరలిస్తుండగా కె.నువగాం పోలీసులు దాడి చేసి వారిని అరెస్ట్‌ చేశారన్నారు. అరెస్టయిన వారి దగ్గర నుంచి కారు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. అరెస్ట్‌ అయిన వారిని గొళంతరాకు చెందిన రవీంద్ర గౌడ, కె. నువగాంకు చెందిన విద్యాధర్‌ ప్రధాన్, మహేష్‌ దేశాయి, ముంబైకి చెందిన మోహిత్‌ వర్మ, సూరజ్‌ విజయ్‌ మిశ్రాలుగా గుర్తించామని ఐఐసీ తెలియజేశారు.

Share.

Leave A Reply

%d bloggers like this: