గ్రామీణ బ్యాంకుల్లో కొలువుల జాత‌ర‌

0

బ్యాంకింగ్‌ రంగంలో కొలువుల జోరు కొనసాగుతోంది. ఇటీవలే ఎస్‌బీఐ రెండు వేల ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇప్పుడు అదే కోవలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో వివిధ విభాగాల్లో 10,190 పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (ఐబీపీఎస్‌) కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ (సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ గఐఐ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సుస్థిర కెరీర్‌కు చిరునామాగా నిలిచే బ్యాంకింగ్‌ రంగంలో కొలువు అంటే జాక్‌పాట్‌ తగిలినట్టే. ఈ నేపథ్యంలో సంబంధిత వివరాలను చూద్దాం..
ఐబీపీస్‌ ప్రస్తుత నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తోన్న పోస్టులకు సంబంధించి ఖాళీలు ఇలా ఉన్నాయి.
ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌) – 5249
ఆఫీసర్‌ స్కేల్‌ – ఐ (అసిస్టెంట్‌ మేనేజర్‌) – 3312
ఆఫీసర్‌ స్కేల్‌ – ఐఐ (జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్లు) – 1208
ఆఫీసర్‌ స్కేల్‌ – ఐఐ (స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌, మేనేజర్‌) – 261
ఆఫీసర్‌ స్కేల్‌ – ఐఐఐ (సీనియర్‌ మేనేజర్‌) – 160
అర్హతలు
*ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌): ఏదైనా డిగ్రీ. స్థానిక భాషతోపాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.
*వయసు: 18 నుంచి 28 ఏళ్లు (జూన్‌ 1, 2018 నాటికి)
*ఆఫీసర్‌ స్కేల్‌ – ఐ (అసిస్టెంట్‌ మేనేజర్‌): ఏదైనా డిగ్రీ. స్థానిక భాషతోపాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, ఫారెస్ర్టీ, యానిమల్‌ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్‌, ఐటీ, మేనేజ్‌మెంట్‌, ఎకనామిక్స్‌ విభాగాల్లో డిగ్రీ ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు.
*వయసు: 18 నుంచి 30 ఏళ్లు (జూన్‌ 1, 2018 నాటికి)
*ఆఫీసర్‌ స్కేల్‌ – ఐఐ (జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌): ఏదైనా డిగ్రీ. స్థానిక భాషతోపాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, ఫారెస్ర్టీ, యానిమల్‌ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్‌, ఐటీ, మేనేజ్‌మెంట్‌, లా, ఎకనామిక్స్‌ తదితర విభాగాల్లో డిగ్రీ ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. బ్యాంకింగ్‌ / ఫైనాన్షియల్‌ రంగంలో రెండేళ్ల అనుభవం.
*వయసు: 21 నుంచి 32 ఏళ్లు (జూన్‌ 1, 2018 నాటికి)
*ఆఫీసర్‌ స్కేల్‌ – ఐఐ (స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌ – సీఏ, ట్రెజరీ మేనేజర్‌, మార్కెటింగ్‌ మేనేజర్‌, ఐటీ, అగ్రికల్చర్‌): పోస్టును అనుసరించి ఆయా విభాగాల్లో డిగ్రీ / పీజీ. సంబంధిత రంగంలో ఏడాది / రెండేళ్ల అనుభవం.
*ఆఫీసర్‌ స్కేల్‌ – ఐఐఐ (సీనియర్‌ మేనేజర్‌): ఏదైనా డిగ్రీ. స్థానిక భాషతోపాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. అగ్రికల్చర్‌, ఫారెస్ర్టీ, వెటర్నరీ సైన్స్‌, ఐటీ, మేనేజ్‌మెంట్‌, లా, ఎకనామిక్స్‌ తదితర విభాగాల్లో డిగ్రీ ఉన్న వారికి ప్రాధాన్యం. బ్యాంకింగ్‌ / ఫైనాన్షియల్‌ రంగంలో ఐదేళ్ల అనుభవం.
*వయసు: 21 నుంచి 40 ఏళ్లు (జూన్‌ 1, 2018 నాటికి)
ఎంపిక విధానం
ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌) పోస్టులను కేవలం రాత పరీక్ష ద్వారా మాత్రమే భర్తీ చేస్తారు. ఆఫీసర్‌ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ దశల్లో చూపిన ప్రతిభ ఆధారంగా నియామకం ఉంటుంది. రాత పరీక్షలను ఆబ్జెక్టివ్‌ విధానంలో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లీష్‌, హిందీ మాధ్యమాల్లో మాత్రమే ఉంటుంది. రాత పరీక్షలో రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌), ఆఫీసర్‌ స్కేల్‌ – ఐ (అసిస్టెంట్‌ మేనేజర్‌) పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్‌ అనే రెండు అంచెలతో కూడిన రాత పరీక్ష ఉంటుంది. ఆఫీసర్‌ స్కేల్‌ – ఐఐ, ఆఫీసర్‌ – ఐఐఐ పోస్టులకు ఒకే రాత పరీక్షను (సింగిల్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌) నిర్వహిస్తారు.
ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌)
*ప్రిలిమినరీ పరీక్ష : ఇందులో రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున మొత్తం 80 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వీటికి 80 మార్కులు. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు.
*మెయిన్‌ ఎగ్జామ్‌: ఇందులో రీజరింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లీష్‌ / హిందీ లాంగ్వేజ్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ విభాగాల్లో ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది. ఇందులో రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ ఒక్కో సెక్షన్‌కు 50 చొప్పున మార్కులు కేటాయించారు. జనరల్‌ అవేర్‌నెస్‌, లాంగ్వేజ్‌ (ఇంగ్లీష్‌ లేదా హిందీ) ఒక్కో సెక్షన్‌కు 40 చొప్పున మార్కులు ఉంటాయి. కంప్యూటర్‌ అవేర్‌నెస్‌కు 20 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 2 గంటలు.
ఆఫీసర్‌ స్కేల్‌ – ఐ
*ప్రిలిమినరీ పరీక్ష: ఇందులో రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున 80 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. మొత్తం 80 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు.
*మెయిన్‌ ఎగ్జామ్‌: ఇందులో రీజరింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లీష్‌ / హిందీ లాంగ్వేజ్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఈ అయిదు విభాగాల్లో ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున మొత్తం 200 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది.
*ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారినే మెయిన్స్‌కి అనుమతిస్తారు. ప్రిలిమినరీ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు.
ఆఫీసర్‌ స్కేల్‌ – ఐఐ (జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌)
ఇందులో రీజరింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లీష్‌ / హిందీ లాంగ్వేజ్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఈ అయిదు విభాగాల్లో ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున మొత్తం 200 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది. ఇందులో రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ఒక్కో సెక్షన్‌కు 50 చొప్పున మార్కులు కేటాయించారు. ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌, లాంగ్వేజ్‌ (ఇంగ్లీష్‌ లేదా హిందీ) ఒక్కో సెక్షన్‌కు 40 చొప్పున మార్కులు ఉంటాయి. కంప్యూటర్‌ అవేర్‌నెస్‌కు 20 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 2 గంటలు.
ఆఫీసర్‌ స్కేల్‌ – ఐఐ (స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌)
ఇందులో రీజరింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లీష్‌ / హిందీ లాంగ్వేజ్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌, ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ (పోస్టును అనుసరించి) ఈ ఆరు విభాగాల్లో ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున మొత్తం 240 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది. ఇందులో రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ ఒక్కో సెక్షన్‌కు 40 చొప్పున మార్కులు కేటాయించారు. లాంగ్వేజ్‌ (ఇంగ్లీష్‌ లేదా హిందీ), కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఒక్కో సెక్షన్‌కు 20 చొప్పున మార్కులు ఉంటాయి. ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌కు 40 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 2 గంటల 30 నిమిషాలు.
ఆఫీసర్‌ స్కేల్‌ – ఐఐఐ (సీనియర్‌ మేనేజర్‌)
ఇందులో రీజరింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లీష్‌ / హిందీ లాంగ్వేజ్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఈ అయిదు విభాగాల్లో ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున మొత్తం 200 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది. ఇందులో రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ఒక్కో సెక్షన్‌కు 50 చొప్పున మార్కులు కేటాయించారు. ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌, లాంగ్వేజ్‌ (ఇంగ్లీష్‌ లేదా హిందీ) ఒక్కో సెక్షన్‌కు 40 చొప్పున మార్కులు ఉంటాయి. కంప్యూటర్‌ అవేర్‌నె్‌సకు 20 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 2 గంటలు.
ముఖ్య సమాచారం
*దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా
*దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 2, 2018.
*ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: ఆఫీసర్‌ – ఐ ఆఫీసర్లకు ఆగస్టు 11, 12, 18; ఆఫీస్‌ అసిస్టెంట్లకు ఆగస్టు 19, 25, సెప్టెంబరు 1
*మెయిన్‌ / సింగిల్‌ ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌ తేదీలు: ఆఫీసర్‌ – స్కేల్‌ ఐ, ఐఐ, ఐఐఐ ఆఫీసర్లకు సెప్టెంబరు 30; ఆఫీస్‌ అసిస్టెంట్లకు అక్టోబరు 7.
*వెబ్‌సైట్‌:www.ibps.in

ఇలా సిద్ధమవ్వాలి…
*క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: ఈ విభాగాన్ని అభ్యర్థులు క్లిష్టమైనదిగా భావిస్తారు. ఇందులో భిన్నాలు, దశాంశాలు, శాతాలు, లాభ – నష్టాలు, నిష్పత్తి, డిస్కౌంట్‌, పార్ట్‌నర్‌షిప్‌, వ్యాపార గణితం (వడ్డీ), కాలం – దూరం, కాలం – పని, గ్రాఫ్స్‌, త్రిభుజాలు, సర్కిల్స్‌, స్తూపాలు, చతురస్రం, దీర్ఘచతురస్రం, పిరమిడ్‌, ఎత్తు – దూరం, కోణాలు, బార్‌ – చార్ట్‌ డయాగ్రామ్‌ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలో ఎక్కువ స్కోరింగ్‌ చేయాలంటే టేబుల్స్‌, స్వేర్స్‌, క్యూబ్స్‌, స్వేర్‌ రూట్స్‌పై అవగాహన చేసుకోవాలి. తద్వారా కాలిక్యులేషన్స్‌ను చేయడం సులభమవుతుంది.
*రీజనింగ్‌: అభ్యర్థుల తార్కిక శక్తిని పరీక్షించే విభాగం. ముఖ్యంగా సందర్భానుసారం సమయస్ఫూర్తిగా ఎలా వ్యవహరిస్తారో తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు. అనాలజీ, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, బ్లడ్‌ రిలేషన్స్‌, రీజనింగ్‌, అర్థమెటిక్‌, నెంబర్‌ సిరీస్‌, కోడింగ్‌ – డికోడింగ్‌, డేటా సఫిషియెన్సీ, డైరెక్షన్‌ సెన్స్‌, ర్యాంకింగ్స్‌, సీట్‌ అరేంజ్‌మెంట్స్‌, వర్డ్‌ బిల్డింగ్‌, వెన్‌ డయాగ్రమ్స్‌, స్పేస్‌ విజువలైజేషన్‌, మ్యాచింగ్‌ వంటి టాపిక్స్‌పై దృష్టి సారించాలి. ఈ విభాగం కోసం బేసిక్‌ మేథమెటిక్స్‌, అల్ఫాబెట్‌ టెస్ట్‌ అంశాలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి.
*కంప్యూటర్‌ నాలెడ్జ్‌: ఇందులో కంప్యూటర్‌ ఫండమెంటల్స్‌, ఇంటర్నెట్‌, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, కీబోర్డ్‌ షాట్‌కట్స్‌, నెట్‌వర్క్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
*జనరల్‌ / ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌: దీని కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనించాలి. బ్యాంకింగ్‌, ఆర్థిక రంగం, గ్రామీణ బ్యాంకుల్లోని పరిణామాలపై దృష్టి సారించాలి. పరీక్ష తేదీకి ముందు ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలో చోటుచేసుకున్న పరిణామాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
*న్యూమరికల్‌ ఎబిలిటీ: కొద్దిగా కష్టమైన విభాగం. ఇందులో గణితంతో ముడిపడిన సమస్యలు ఉంటాయి. టైమ్‌ ్క్ష డిస్టెన్స్‌, టైమ్‌ అండ్‌ వర్క్‌, ట్రైన్స్‌, సింపుల్‌ ఇంట్రెస్ట్‌, రేషియో, పార్టనర్‌షిప్‌, ఎల్‌సిఎం, హెచ్‌సిఎఫ్‌, కాంపౌండ్‌ ఇంట్రెస్ట్‌, నెంబర్స్‌, పర్సంటేజ్‌, ఏరియాస్‌, ప్రొబబిలిటీ, పర్ముటేషన్స్‌ ్క్ష కాంబినేషన్స్‌ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. మిగతా విభాగాల పోల్చితే ఇందులోని ప్రశ్నలను సాధించడానికి కొంత సమయం పడుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలను ప్రయత్నించేలా సాధన చేయాలి.
ఆఫీస్‌ అసిస్టెంట్‌, ఆఫీసర్‌ – ఐ, ఐఐ, ఐఐఐ కేటగిరీలకు నిర్వహించే రాత పరీక్షలో ప్రతి విభాగంలో నిర్దేశించిన విధంగా అర్హత మార్కులను సాధించాలి. వారిని మాత్రమే షార్ట్‌లిస్ట్‌ సమయంలో పరిగణనలోకి తీసుకుంటారు.
*ఎస్సీ / ఎస్టీ / మైనార్టీ / ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ / దివ్యాంగులకు రీజనల్‌ రూరల్‌ బ్యాంకులు ఆఫీస్‌ అసిస్టెంట్‌, ఆఫీసర్‌ స్కేల్‌ – ఐ ఉద్యోగాల కోసం ప్రీ ఎగ్జామ్‌ ట్రైనింగ్‌ కూడా ఇస్తున్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తున్నప్పుడు ఆ సదుపాయం కోసం అభ్యర్థన కనిపిస్తుంది. దానికి సమ్మతి తెలపడం ద్వారా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. తెలుగు రాష్రాల్లో హైదరాబాద్‌, వరంగల్‌, అనంతపురం, గుంటూరులలో ప్రీ ఎగ్జామ్‌ ట్రైనింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో కేటగిరీల వారీగా ఖాళీలు
బ్యాంక్‌ ఖాళీలు
ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీ పర్పస్‌)
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌ 202
చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌ 129
సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌ 60
ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ 212
తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ 84
పడువాయ్‌ భారతీయార్‌ గ్రామీణ బ్యాంక్‌ 24
ఆఫీసర్‌ స్కేల్‌ – ఐ (అసిస్టెంట్‌ మేనేజర్‌)
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌ 200
చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌ 53
సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌ 40
ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ 120
తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ 55
పడువాయ్‌ భారతీయార్‌ గ్రామీణ బ్యాంక్‌ 6
ఆఫీసర్‌ స్కేల్‌ – ఐఐ (అగ్రికల్చరల్‌ ఆఫీసర్‌)
ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ 44
ఆఫీసర్‌ స్కేల్‌ – ఐఐ (మార్కెటింగ్‌ ఆఫీసర్‌)
తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ 9
ఆఫీసర్‌ స్కేల్‌ – ఐఐ (ట్రెజరీ మేనేజర్లు)
ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ 2
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌ 1
ఆఫీసర్‌ స్కేల్‌ – ఐఐ (లా ఆఫీసరు)
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌ 1
తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ 1
ఆఫీసర్‌ స్కేల్‌ – ఐఐ (ఛార్టర్డ్‌ అకౌంటెంట్లు)
ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ 2
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌ 1
తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ 2
ఆఫీసర్‌ స్కేల్‌ – ఐఐ (ఐటీ ఆఫీసర్లు)
ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ 5
తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ 8
పడువాయ్‌ భారతీయార్‌ గ్రామీణ బ్యాంక్‌ 2
ఆఫీసర్‌ స్కేల్‌ – ఐఐ (జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్లు)
ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ 79
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌ 70
తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ 20
ఆఫీసర్‌ స్కేల్‌ – ఐఐఐ (ఆఫీసర్లు)
ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ 22
తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ 5
కీలకం ప్రిలిమ్స్‌
ప్రస్తుత నోటిఫికేషన్‌ ద్వారా మూడు కేటగిరీల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అయితే ఇందులో కొన్ని ఉద్యోగాలకు అనుభవం తప్పనిసరి. దీంతో అందరూ అన్ని రకాల పోస్టులకు పోటీపడే అవకాశం లేదు. మొత్తం 10,190 పోస్టుల్లో అనుభవం లేకుండా అందరూ దరఖాస్తు చేసుకునే పోస్టుల సంఖ్య 8,561. ఇందులో ఆఫీస్‌ అసిస్టెంట్‌ ఖాళీలు – 5249, ఆఫీసర్‌ స్కేల్‌-ఐ ఖాళీలు 3312. అంటే 85 శాతం పోస్టులు. కాబట్టి ఈ రెండు పోస్టులకు తీవ్రమైన పోటీ నెలకొని ఉంటుంది. అంతేకాకుండా ఈ పోస్టుల కోసం ప్రిలిమినరీ, మెయిన్స్‌గా రెండు దశలుగా రాత పరీక్షను నిర్వహిస్తారు. ఈ క్రమంలో కీలకమైంది ప్రిలిమ్స్‌. ఎందుకంటే లక్షల మంది నుంచి వేల మందికి మాత్రమే మెయిన్‌కు అవకాశం లభిస్తుంది. కాబట్టి ప్రిలిమ్స్‌లో సాధ్యమైనంత వరకు ఎక్కువ మార్కులు సాధించేందుకు ప్రయత్నించాలి. గత కటా్‌ఫలను పరిశీలిస్తూ దాని కంటే ఎక్కువ మార్కులు సాధించేలా కృషి చేయాలి. వీలైనన్ని మాక్‌ టెస్ట్‌లు రాయాలి.
ఉమ్మడిగా సాగాలి
ప్రిలిమినరీ పరీక్షలో ఆఫీస్‌ అసిస్టెంట్‌, ఆఫీసర్‌ స్కేల్‌ – ఐ పోస్టులకు రీజనింగ్‌ విభాగం ఉమ్మడిగా ఉంది. అంతేకాకుండా ఇది మెయిన్‌లో కూడా కనిపిస్తుంది. అంటే రీజనింగ్‌ ప్రిపరేషన్‌ ప్రిలిమినరీ, మెయిన్‌కు కూడా ఉపయోగపడుతుంది. రీజనింగ్‌తోపాటు ఆఫీసర్‌ అసిస్టెంట్‌ ఔత్సాహికులు న్యూమరికల్‌ ఎబిలిటీ, ఆఫీసర్‌ – ఐ అభ్యర్థులు క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ చదవాలి. ఈ అంశాలు మెయిన్‌లో కూడా ఉండటం ప్రిపరేషన్‌పరంగా కలిసొచ్చే అంశం. మెయిన్‌ విషయానికొస్తే అదనంగా మూడు అంశాలను మాత్రమే ప్రిపేర్‌ కావాలి. అవి ఇంగ్లీష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌. ఈ నేపథ్యంలో ప్రిలిమినరీ, మెయిన్‌లో ఉమ్మడి ఉండే అంశాలకు సమగ్రంగా అంటే మెయిన్‌ పరీక్ష స్థాయిలో సన్నద్ధం కావడం ప్రయోజనకరం. ఆఫీసర్‌ స్కేల్‌ – ఐఐ, ఆఫీసర్‌ స్కేల్‌ – ఐఐఐ పోస్టుల్లో అటుఇటుగా ఇవే అంశాలు ఉంటాయి. స్పెషలిస్ట్‌ ఆఫీసర్లకు అదనంగా వారి డొమైన్‌ నాలెడ్జ్‌ను పరీక్షిస్తారు.
వేగంగా.. కచ్చితత్వంతో…
ప్రిలిమ్స్‌లో 45 నిమిషాల్లో 80 ప్రశ్నలకు, మెయిన్‌లో 120 నిమిషాల్లో 200 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఒక ప్రశ్నకు అర నిమిషం సమయం మాత్రమే లభిస్తుంది. కాబట్టి వేగంగా కచ్చితత్వంతో సమాధానాన్ని గుర్తించే విధంగా నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ఈ నేపథ్యంలో మాక్‌ టెస్ట్‌లకు హాజరవ్వడం, ఐబీపీఎస్‌, ఎస్‌ఎస్‌సి గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్‌ చేయడం ప్రయోజనకరం. ముఖ్యంగా మేథ్స్‌, లాజిక్స్‌తో సంబంధం ఉండే రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ వంటి విభాగాల్లో ప్రిపరేషన్‌ పరంగా సాధ్యమైనన్ని షార్ట్‌కట్‌ మెథడ్స్‌ నేర్చుకోవాలి. ఎలిమినేషన్‌ స్కిల్‌ను అలవర్చుకోవాలి.
ఇంటర్వ్యూ
నాబార్డ్‌, ఐబీపీఎస్‌ ఉమ్మడి సహకారంతో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (నోడల్‌ రీజనల్‌ రూరల్‌ బ్యాంక్స్‌) ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తాయి. ఇంటర్వ్యూకు మొత్తం 100 మార్కులు కేటాయించారు. అలాగే అర్హత మార్కులను కూడా నిర్దేశించారు. ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, ఇంటర్వ్యూ వెయిటేజీని 80: 20గా నిర్ణయించారు

Share.

Leave A Reply

%d bloggers like this: