చంద్రబాబుకు అందని ఆహ్వానం

0

హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టినట్టు చెప్పుకునే చంద్రబాబుకు అక్కడ జరిగే ఈవెంట్లకు మాత్రం ఆహ్వానం అందడం లేదు. మొన్నటి ఇవాంకా పర్యటన తాను లేకుండా హైదరాబాద్‌లో జరగదనే బాబు ఆశించారు. కానీ కనీసం ఆహ్వానం అందలేదు. చివరకు ఇవాంకానే ఏపీ వంక రప్పించేందుకు చంద్రబాబు చాలా ప్రయత్నించారు. కానీ బాబు విజ్ఞప్తిని కేంద్రం గానీ, అమెరికా అధికారులుగానీ కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. ఒకప్పుడు అమెరికా అధ్యక్షులనే హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఆడించానన్న బాబుకు అదో ఘోర అవమానంగా భావించారు. కనీసం తెలంగాణ ప్రభుత్వం మెట్రో ప్రారంభోత్సవానికి కూడా చంద్రబాబును ఆహ్వానించలేదు. ఇప్పుడు తెలుగు మహాసభలకు కూడా చంద్రబాబును ఆహ్వానించలేదు. మహాసభల మొదటి రోజు ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రంలో తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశమైంది. మహాసభల ప్రారంభోత్సవానికి చంద్రబాబును ఆహ్వానించాలా వద్ద అన్న దానిపై తెలంగాణ పెద్దలు చర్చలు జరిపారు. కానీ చంద్రబాబును ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చేశారు. మరొకరి సాయం లేకుండానే తనను తాను పొగుడుకోవడం, ఈ రోజు హైదరాబాద్‌ బతికి బట్టకడుతోందంటే తన వల్లే అని చెప్పుకోవడంలో దిట్ట అయిన చంద్రబాబును పిలిస్తే మహాసభల్లో కూడా ఆయన అదే పనిచేస్తారన్న ఉద్దేశంతో చంద్రబాబుకు ఆహ్వానం అందలేదని చెబుతున్నారు.

పైగా తొలిరోజు చంద్రబాబును ఆహ్వానిస్తే ఎలాగో బాబుకు అనుకూలంగా పనిచేస్తున్న 80 శాతం మీడియా.. తన ఫోకస్ మొత్తం ఆయన మీదకు మళ్లించి చంద్రుడొచ్చాడు అంటూ కార్యక్రమం అసలు ఉద్దేశాన్ని దారి మళ్లిస్తుందన్న అభిప్రాయానికి తెలంగాణ పెద్దలు వచ్చినట్టు చెబుతున్నారు. తెలుగు మహాసభల సంగతి పక్కనపడేసి ఇద్దరు చంద్రుల కలయిక, మహాసభల్లో ఆంధ్రచంద్రుడు ఇలా రకరకాలుగా మీడియా ప్రచారం చేస్తుందన్న నిర్ణారణకు వచ్చారు.

అందుకే తొలి రోజు వేడుక ఆహ్వానపత్రంలో చంద్రబాబుకు చోటు దక్కలేదంటున్నారు. అయితే తెలుగు మహాసభలకు ఎవరెవరినో పిలిచి తోటి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలువకపోతే బాగోదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు మహాసభల ముగింపు వేడుకకు ఆహ్వానిస్తే సరిపోతుందని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది.

Share.

Leave A Reply

%d bloggers like this: