చిరు సైరాకు మ‌రో షాక్‌?

0

ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రం మరింత భారీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీ బడ్జెట్ తో చారిత్రక చిత్రంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమా పూజా కార్యక్రమాలు జరిగిన చాలా కాలం తరువాత ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లింది. కానీ అనుకున్న రీతిలో సినిమా ముందుకు సాగడం లేదు. అయితే సినిమా అధికారిక ప్రకటన వచ్చిన దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు ఒక్కరొక్కరుగా తప్పుకుంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సినిమాటోగ్రాఫర్ గా రవివర్మన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా ఆయన స్థానంలో రత్నవేలును తీసుకున్నారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ను సెలక్ట్‌ చేయకుండానే రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లటం గ‌మ‌నార్హం. మరి రెహమాన్ స్థానం ఏ సంగీత దర్శకుడిని తీసుకుంటారో చూడాలి. కీరవాణితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం ఉన్నా అది ఇంకా కొలిక్కి రాలేదు. కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై రామ్‌ చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం నయన్‌ ఇచ్చిన డేట్లు మురుగున పడిపోయాయని, ఆమె ఇతర సినిమా షూటింగ్‌లో బిజిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె కోసం సైరా షూటింగ్ డేట్లు అడ్జస్ట్ చేసుకుంటారో.? షూటింగ్ కోసం నయనతారను కాకుండా వేరెవరినైనా తీసుకుంటారో.? చూడాలి. ఇందులో అమితాబ్‌ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్‌ సేతుపతి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Share.

Leave A Reply

%d bloggers like this: