చ‌దువుల విప్ల‌వం తీసుకొస్తా..వైఎస్‌.జ‌గ‌న్

0

మ‌హిళ‌ల‌కు 45 ఏళ్ల‌కే రూ.2వేల పింఛ‌న్‌
వృద్దుల‌కూ రూ.2వేల పింఛ‌న్‌
మ‌హిళ‌ల ఆత్మీయ స‌దస్సులో వైఎస్‌.జ‌గ‌న్‌
‘పేదలు వారి పిల్లల చదువు కోసం వెనుకాడకూడదు. మ‌న ప్రభుత్వం అధికారంలోకి రాగానే చదువుల విప్లవానికి శ్రీకారం చుడతాం. పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికీ ఏటా రూ.15 వేలు, పై చదువులు చదివే పిల్లల హాస్టల్‌ ఖర్చు కింద రూ.20 వేలు ఇస్తాం. పిల్లలు ఎంత పెద్ద చదువు చదివితే అంత వరకు అయ్యే ఖర్చును మన ప్రభుత్వమే భరిస్తుంది’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు భరోసా ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం 44వ రోజు అనంతపురం జిల్లా ధనియాని చెరువు గ్రామంలో వైఎస్‌ జగన్‌ మహిళల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. అక్కా చెల్లెళ్ల ప్రశ్నలు, సందేహాలకు ఆయన ఓపికగా సమాధానమిచ్చారు. మనందరి ప్రభుత్వం రాగానే అన్ని కష్టాలు తీరుతాయన్నారు. ఏ ఒక్కరూ రేషన్‌ కార్డు కోసమో, పింఛన్‌ కోసమో, మరేదైనా సర్టిఫికెట్‌ కోసమో గడపగడపా ఎక్కాల్సిన పని లేకుండా గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి 72 గంటల్లో సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. ఎన్ని లక్షల రూపాయలు ఖర్చయినా సరే మొత్తం ఫీజును నేనే కట్టి చదివించడమే కాకుండా మెస్‌ చార్జీలు, హాస్టల్‌ ఖర్చుల కింద ప్రతి పిల్లవాడికీ రూ.20 వేలు ఇచ్చి తోడుగా ఉంటా. బడికి పంపినందుకు ప్రతి తల్లికీ రూ.15వేలు ఇచ్చి తోడుగా నిలుస్తాం.
రూ.2 వేల పింఛన్‌..
ఈ వేళ లంచాల మయమైన జన్మభూమి కమిటీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి పింఛన్లు ఇస్తున్నారు. రేషన్‌ కార్డు మొదలు చివరకు మరుగుదొడ్ల వరకు అన్నింటికీ లంచాలే. మనం అధికారంలోకి రాగానే ఇప్పుడున్న పెన్షన్‌ వయస్సు 65 ఏళ్లను 60 ఏళ్లకు తగ్గిస్తాం. అందరికీ నెలకు రూ.2 వేల పింఛన్‌ ఇస్తాం. ఇక పనికి వెళితే తప్ప పూటగడవని స్థితిలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్‌ ఇస్తాం. వైఎస్సార్‌ చేయూత పెన్షన్‌ పథకం కింద నెలకు రూ.2 వేలు ఇచ్చి ఆ అక్కా చెల్లెమ్మలకు తోడుగా నిలుస్తాం.
ఇంత‌కన్నా మోసం ఉందా?
చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పిన దానికి, ఆ తర్వాత చేసిన దానికి పొంతనే లేదు. పొదుపు సంఘాల రుణాలు అన్నీ మాఫీ చేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఇప్పటికీ ఒక్క రూపాయి మాఫీ చేయలేదు. రుణాలు మాఫీ కాకపోగా బంగారం వేలం నోటీసులు ఇళ్లకు వస్తున్నాయి. దీంతో పాటు సున్నా వడ్డీ రుణాలు రాకుండా పోయాయి. రైతులదీ ఇదే పరిస్థితి. ఇంతకన్నా మోసం, అన్యాయం, దగా ఉంటుందేమో మీరే చెప్పండి? ఇసుక మాఫియా దురాగతాలను అడ్డుకుందన్న సాకుతో మహిళా తహసీల్దార్‌ వనజాక్షిని నడిరోడ్డు మీద తన పార్టీ ఎమ్మెల్యే చేయి చేసుకుంటే ఆయనపై చర్య తీసుకోలేదు. రిషితేశ్వరి అనే ఓ విద్యార్థినిని ర్యాగింగ్‌ చేసి చంపేసినా నిందితుల్ని అరెస్ట్‌ చేయలేదు. రాష్ట్రంలో తాగడానికి మంచి నీళ్లు దొరకడం లేదు. కానీ, ఫోన్‌ కొడితే చాలు మద్యం మాత్రం హోం డెలివరీ చేస్తున్నారు. బెల్ట్‌ షాపుల్ని రద్దు చేస్తానంటూ తొలి సంతకం చేసిన చంద్రబాబు ఆ తర్వాత మర్చిపోయారు. మ‌న ప్ర‌భుత్వం రాగానే ద‌శ‌ల‌వారీగా మ‌ద్యం నిషేధిస్తామ‌ని హామీనిచ్చారు. అర్హులందరికీ ఇల్లు కట్టిస్తాం. ఇదంతా జరగాలంటే మీ అందరి ఆశీర్వాదం కావాలి’’ అని జగన్‌ కోరారు

Share.

Leave A Reply

%d bloggers like this: