చ‌ర‌ణ్ నామ‌స్మ‌ర‌ణ‌లో బాలీవుడ్

0

రామ్ చరణ్ ఇప్పుడు సడెన్ గా ఉత్తరాదిలో హాట్ టాపిక్ అయిపోయాడు. గతంలో జంజీర్(తెలుగులో తుఫాన్) అంటూ బాలీవుడ్ మూవీ చేసినపుడు రానంత బజ్.. ఇప్పుడు ఒక్కసారిగా వచ్చేసింది. అయితే.. ఇదేమీ సినిమాకు సంబంధించిన వ్యవహారం కాదు లెండి. రామ్ చరణ్ రీసెంట్ హిట్ రంగస్థలంను బాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తారనే టాక్ ఉన్నా.. ఇక్కడ టాపిక్ మాత్రం వేరే. ఒక్కసారిగా చరణ్ పేరు మీడియాలో మార్మోగడానికి కారణం.. అందాల తార శ్రీదేవి కూతురు జాన్వి కపూర్. జాన్వి మూలంగానే ఇప్పుడు చెర్రీ గురించి జనాలు చర్చించుకుంటున్నారు. రీసెంట్ గా మామ్ మూవీకి గాను శ్రీదేవికి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ వస్తే.. దాన్ని అందుకునేందుకు జాన్వి కపూర్ చీరలో వచ్చి అమ్మను తలపించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ చీర ఎక్కడిదో కాదు.. గతంలో శ్రీదేవి కట్టిన చీరే. అంటే అమ్మ కట్టిన చీరను అదే మాదిరిగా కట్టుకొచ్చిందన్న మాట. ఈ చీరకు రామ్ చరణ్ కు కూడా లింక్ ఉంది. రామ్ చరణ్ – ఉపాసన పెళ్లి సందర్భంగా శ్రీదేవి ఈ చీరనే కట్టింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కప్ బోర్డ్ లోంచి ఆ చీరను బయటకు తీసి.. అదే పట్టు చీరను.. అదే మాదిరిగా కట్టుకుని అవార్డ్ ఫంక్షన్ కు వచ్చింది జాన్వి. అలా జాన్వి కపూర్ కారణంగా.. ఉత్తరాది మొత్తం ఇప్పుడు రామ్ చరణ్ గురించి మాట్లాడుకునే సందర్భం వచ్చింది.

Share.

Leave A Reply

%d bloggers like this: