జగన్ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ

0

తనకు రాజకీయ పదవులపై ఆశలేదని, జగన్ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని వైసీపీ నాయకురాలు గంగుల భానుమతి అన్నారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, వ్యక్తిగత కారణాలతో కొంతకాలంగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనలేకపోయానని, తాను వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తన భర్త సూరి హత్యానంతరం తమ వర్గం బలహీనపడిన మాట వాస్తవమేనని అన్నారు. ప్రత్యర్థులను హతమార్చాలనుకుంటే, అదేమీ తమకు పెద్ద సమస్య కాదని, ఫ్యాక్షనిజం, ప్రతీకార హత్యలకు చరమగీతం పాడామని చెప్పారు. సీఎం చంద్రబాబు ఫ్యాక్షనిజాన్ని రెచ్చగొడుతున్నారని భానుమతి ఆరోపించారు. కాగా, క్రియాశీలక రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్న మద్దెల చెరువు సూరి భార్య గంగుల భానుమతి మళ్లీ తెరపైకి వచ్చారు. రాప్తాడు నియోజకవర్గంలో పాదయాత్రలో ఉన్న జగన్ ని రెండు రోజుల క్రితం ఆమె కలిశారు.

Share.

Leave A Reply

%d bloggers like this: