జ‌న‌వ‌రిలో కోదండ‌రామ్ కొత్త పార్టీ

0

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి మరో పార్టీ వచ్చేస్తోంది. కేసీఆర్ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరవేస్తున్న తెలంగాణ ఉద్యమనేత, టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం వచ్చే నెలలో పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే జనవరిలో ఆయన పార్టీని ప్రకటిస్తారని జేఏసీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ తెరపైకి రానున్న కొత్త పార్టీకి ఏం పేరు పెట్టాలన్న దానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ‘తెలంగాణ జన సమితి’ (టీజేఎస్) అయితే బాగుంటుందని చాలామంది భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ‘తెలంగాణ సకల జన సమితి’ అనే ఇంకో పేరు కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. అయితే ప్రస్తుతానికి ఇంకా పేరు ఖరారు కాలేదు. జనవరి తొలి వారంలో అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఓ యూనిట్‌గా తీసుకుని గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తారు. ఆ తర్వాత గ్రామ, మండల, నియోజకవర్గ కమిటీలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత టీజేఏసీ కోర్ సభ్యులు సమావేశమై పార్టీ నిర్మాణం, లక్ష్యం, విధివిధానాలు తదితర వాటి గురించి చర్చిస్తారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఆ తర్వాత పార్టీని ప్రకటించనున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్ఎస్‌తో కలిసి పనిచేసిన కోదండరాం ఉద్యమానికి ఊపు తెచ్చారు. అయితే కేసీఆర్ సీఎం అయ్యాక ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపాయి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన లేదంటూ కోదండరాం మరోమారు ఉద్యమబాట పట్టారు.

Share.

Leave A Reply

%d bloggers like this: