టీచ‌ర్ పాత్ర‌లో మెహ‌రీన్‌

0

పువ్వులు పట్టుకోవాల్సిన ఆ సుకుమారి చేతులు బెత్తం పట్టుకుంటే.. ముద్దుముద్దుగా చిలక పలుకులు పలికే ఆ బ్యూటీ నోటి నుంచి చీవాట్లు వస్తే.. వెరైటీగా ఉంటుంది కదూ. ఇప్పటివరకూ బబ్లీ క్యారెక్టర్స్‌లో కనిపించిన మెహరీన్‌ ఇలాంటి పాత్రలోనే కనిపించనున్నారు. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ, మహానుభావుడు, రాజా ది గ్రేట్‌’ సినిమాలతో హ్యాట్రిక్‌ హిట్స్‌ అందుకున్న ఈ పంజాబీ బ్యూటీ ప్రస్తుతం గోపీచంద్‌ సరసన ఓ సినిమాలో నటిస్తున్నారు. చక్రి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మెహరీన్‌ టీచర్‌ పాత్రలో కనిపించనున్నారు. బెత్తం పట్టుకుని పంతులమ్మగా కనిపించనున్నారు. ఇప్పటివరకూ మోడ్రన్‌ దుస్తుల్లో కనువిందు చేసిన ఈ బ్యూటీ ఈ చిత్రంలో దాదాపు చీరల్లోనే కనిపించనున్నారట. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది.

Share.

Leave A Reply

%d bloggers like this: