టీడీపీది మిత్ర ద్రోహ‌మేనా..?

0

ఏపీలో తెలుగుదేశం పార్టీది మిత్ర ద్రోహ‌మే అంటున్నారు బీజేపీ నేత‌లు. గుజరాత్ ఫలితాల సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు సోమ‌వారం చేసిన ఈ వ్యాఖ్యలు టీడీపీలో అస‌హ‌నం తెప్పించాయి. దీనిపై టీడీపీకి చెందిన ముళ్ల‌పూడి రేణుక ఓ చాన‌ల్‌కు ఇంట‌ర్వూ ఇచ్చారు. అందులో ఘాటుగా మాట్లాడారు. ఏపీలో బీజేపీ లాలీ పాప్‌లో పుల్ల లాంటిదని ఎద్దేవా చేశారు. దీనిపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు అంతే ఘాటుగా రియాక్టయ్యారు. తాము లాలీపాప్ లు – ఐస్ క్రీం పుల్లలమంటూ మాట్లాడడం సరికాదన్నారు. అంత పనికిరాని వారయినప్పుడు బీజేపీతో పొత్తు ఉండదని ఆ పార్టీ నేత చంద్రబాబు స్వయంగా ప్రకటించాలని అన్నారు. తమపై టీడీపీ నేత బాబు రాజేంద్ర్రప్రసాద్ వంటివారు తరచుగా కామెంట్లు చేయడం…ఆ మరుసటి రోజు చంద్రబాబు వాటిని ఖండించడం అదుపులో ఉండాలని చెప్పడం ఓ ప్రహసనం అయిపోయిందే..తప్ప ఎలాంటి మార్పు లేదని ఆయన వ్యాఖ్యానించారు. పొత్తులో భాగంగా చంద్రబాబు ఎంతో ఆదరించామని అయితే మిత్రపక్షంతో ప్రతిసారీ బీజేపీ మోసపోతోందన్నారు. 2004లో చంద్రబాబుతో ఎన్నికలకు వెళ్లి తాము ఓడిపోయామ‌ని పేర్కొన్నారు. ఇదిలాఉండగా…అనుమతి లేకుండా బీజేపీపై ఎలాంటి విమర్శలు చేయరాదని చంద్ర‌బాబు పార్టీ నేతలను హెచ్చరించారని టీడీపీ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం.

Share.

Leave A Reply

%d bloggers like this: