టీడీపీపై వెన‌క్కు త‌గ్గ‌ని వీర్రాజు

0

టీడీపీపై బీజేపీ నాయకుడు – ఎమ్మెల్సీ సోము వీర్రాజు తన దూకుడును ఏ మాత్రం తగ్గించడం లేదు. గుజరాత్ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ…సీట్లు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి చేరుకున్నామని చెప్పిన వీర్రాజు…ఈ సందర్భంగా తమ ఎదుగుదలను టీడీపీ ఓర్వలేకపోతోందని ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ కౌంటర్ చేసి వీర్రాజు శాంతించ‌లేదు. టీడీపీపై విమ‌ర్శ‌లు సంధించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బుధవారం ఆయ‌న విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై విరుచుకుపడ్డారు. టీడీపీ పాలన కంటే ఇతర అంశాలపైనే ఎక్కువ దృష్టి సారించిందని ఆరోపించారు. టీడీపీ చేయాల్సింది ట్రేడింగ్ కాదు రూలింగ్ అంటూ విమర్శలు చేశారు. నిధుల గురించి పాలకులు గగ్గోలు పెడుతున్నారని అయితే…ఇసుక – ఎన్ ఆర్జీ ఎస్ – ఎర్ర చందనం – గ్రానైట్ నిధులు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నించారు. దీంతో పాటుగా ప్రభుత్వంలో తమకు సరైన గౌరవం దక్కడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తమ పార్టీ సీనియర్ నాయకుడైన మంత్రి మాణిక్యాలరావుకు కనీస గౌరవం ఇవ్వడం లేదని మండిపడ్డారు. కాకినాడలో తమకు కేటాయించిన సీట్లలో టీడీపీ పోటీచేసిందని పేర్కొన్న వీర్రాజు ఈ విషయంలో వాస్తవాలు మరుగున పరిచి ఆ ఎన్నికల్లో గెలుపుపై వక్రభాష్యం చెబుతోంద‌ని ఆ పార్టీపై మండిపడ్డారు.

Share.

Leave A Reply

%d bloggers like this: