ట్రంప్‌, కిమ్‌.. నాలుగు ఒప్పందాలు

0

సంపూర్ణ అణ్వాయుధ నిరాయుధీకరణే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ల మధ్య సింగ‌పూర్‌లో జరిగిన చరిత్రాత్మక భేటీ ఫలప్రదమైంది. ఇరు దేశాల అధ్యక్షులు ఉమ్మడి తీర్మానంపై సంతకాలు చేశారు.
తీర్మానంలోని ముఖ్యాంశాలు..
– శాంతి సౌభాగ్యాల సాధనలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమెరికా, ఉత్తర కొరియాలు కొత్త సంబంధాలను నెలకొల్పుకుంటాయి.
– కొరియా ద్వీపకల్పంలో సుస్థిర శాంతి స్థాపనకు అమెరికా, ఉత్తర కొరియా కలిసి పని చేస్తాయి.
– 2018 ఏప్రిల్ 27 నాటి పాన్‌ ముంగ్‌ జోమ్‌ తీర్మానానికి అనుగుణంగా సంపూర్ణ అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా కట్టుబడి ఉంటుంది.
– యుద్ధ ఖైదీలను తక్షణమే తిరిగి అప్పగించడం.

Share.

Leave A Reply

%d bloggers like this: