ఒక ఆకు రాలుతూ చెప్పింది.. ఈ జీవితం శాశ్వతం కాదని
ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది.. జీవితం ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని
ఒక మేఘం వర్షిస్తూ చెప్పింది.. చేదుని గ్రహిస్తూ మంచిని పంచమని
ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది.. ఉండేది ఒక్క క్షణమైనా ఉజ్వలంగా ఉండమని
ఒక కొవ్వొత్తి కరిగిపోతూ చెప్పింది.. చివరి వరకు పరులకు సాయపడమని
ఒక వృక్షం చల్లగా చెప్పింది.. తనలాగే కష్టాల్లో ఉన్నా ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని
ఒక ఏరు జలజలా పారుతూ చెప్పింది.. తనలాగే కష్టసుఖాల్లో చలించకుండా సాగమని
జాబిల్లి వెలుగుతూ చెప్పింది.. తనలాగే ఎదుటివారిలో వెలుగు నింపమని(రచన, వైఎస్.రేఖ, బీఎస్సీ మొదటి సంవత్సరం,
పారామెడికల్ (2016), స్విమ్స్, తిరుపతి)
తెలుసుకుందాం.. మనిషిగా మారుదాం
0
Share.