తొలి టీ-20లో భార‌త్ జ‌య‌భేరి

0

శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ జ‌య‌భేరి మోగించింది. టీమిండియా స్పిన్నర్‌ యజువేంద్ర చహల్ ‌(4-23) మాయాజాలానికి శ్రీలంక బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో లంకపై భారత్‌ 93 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో 3 టీ20ల సిరీస్‌లో భారత్‌ 1-0తో ఆధిక్యం సాధించింది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక బ్యాట్స్‌మెన్‌లో ఉపుల్‌ తరంగ 23( 16 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సులు), కుశాల్‌ పెరీరా(19), డిక్‌వెల్లా(13), చమీరా(12)లు మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవ్వడంతో శ్రీలంక 87 పరుగులకే కుప్పకూలింది. భారత్‌ బౌలర్లలో చాహల్‌ (4), పాండ్యా(3), కుల్దీప్‌ యాదవ్‌(2) వికెట్లు తీయగా.. ఉనద్కత్‌ ఒక​ వికెట్‌ తీశాడు.
రాహుల్‌ హాఫ్‌ సెంచరీ..
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఓపెనర్‌ రోహిత్‌(17) నిరాశపర్చగా.. మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ 61 (48 బంతుల్లో 7 ఫోర్లు, 1సిక్సు) అర్ధ సెంచరీతో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. మరో యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ 24(20 బంతులు, 3 ఫోర్లు).. చివర్లో ధోని 39(22 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సు), మనీష్‌ పాండే 32(18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు) రాణించడంతో భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది.

Share.

Leave A Reply

%d bloggers like this: