త‌మిళ నేత‌ల‌ను ఆద‌ర్శంగా తీసుకోండి.. ప‌వ‌న్‌

0

ఆంధ్రప్రదేశ్ నేత‌లు త‌మిళ‌నాడు నాయ‌కుల‌ను ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సూచించారు. అస‌లు విష‌యం ఏమిటంటే? నష్టాల్లో ఉన్నప్పటికీ, సేలం స్టీల్ ప్లాంటును ప్రైవేటు సంస్థలకు అప్పగించకుండా ఆ ప్రభుత్వం అడ్డుకుంటోందని గుర్తు చేశారు. అయితే ఇక్క‌డ మాత్రం లాభాల్లో ఉన్న డీసీఐ (డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ప్రైవేటీకరణ యత్నాలను అడ్డుకునేందుకు ముందుకు రాక‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌ని పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రజల వెనుక అక్కడి నేతలు నిలబడగా లేనిది, మన రాష్ట్రంలో నేతలు మాత్రం అదే తరహా సమస్య పరిష్కారానికి ముందడుగు వేయకపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలంతా కలసి లాభాల్లో ఉన్న డీసీఐ (డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ప్రైవేటీకరణ యత్నాలను అడ్డుకునే దిశగా ఢిల్లీకి వెళ్లి, ప్రధాని నరేంద్ర మోదీని కలవాలని కోరారు. ఎంపీలంతా వెళ్లి ఆయనకు ఓ వినతిపత్రాన్ని ఇవ్వాలని సూచించారు. ఈ విషయంలో ఏపీ నేతలను ఎవరు ఆపుతున్నారో అర్థం కావడం లేదని తన ట్విట్టర్ ఖాతా ద్వారా విమర్శించారు.

Share.

Leave A Reply

%d bloggers like this: