దిన‌క‌ర‌న్ ఘ‌న‌విజ‌యం

0

ఆర్కేనగర్ ఉపఎన్నికలో శశికళ వర్గం నేత టీటీవీ దినకరన్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. అధికార అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్ పై సుమారు 40 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. ప్రతిపక్ష డీఎంకే అభ్యర్థి మురుదు గణేష్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. ప్రత్యర్థులపై తొలి రౌండ్ తుది రౌండ్ దినకరన్ ఆధిక్యం కనబరిచారు. ఈ ఉపఎన్నికలో మొత్తం 18వ రౌండ్లు పూర్తయ్యేసరికి, దినకరన్ కు 86,472 ఓట్లు, అన్నా డీఎంకేకు 47,115, డీఎంకేకు 24,075 ఓట్లు లభించాయి. ఈ ఉప ఎన్నికలో ఒకే ఒక పోస్టల్ బ్యాలెట్ పోలైంది. కాగా, దినకరన్ విజయంతో ఆయన నివాసం వద్ద అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

Share.

Leave A Reply

%d bloggers like this: