ద‌క్షిణాదిన సెకండ్ ప్లేస్‌లో ‘అజ్ఞాతవాసి’

0

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌ల కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటోన్న‌ ‘అజ్ఞాతవాసి’ సినిమా టీజ‌ర్ విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ టీజ‌ర్ విడుద‌లైన 24 గంటల్లోనే 64 లక్షల వ్యూస్ ద‌క్కించుకుంది. ద‌క్షిణాది సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఈ స్థాయిలో వ్యూస్ రాబ‌ట్టిన రెండో టీజ‌ర్‌గా ప‌వ‌న్ సినిమా నిలిచింది. తమిళ హీరో విజయ్ నటించిన మెర్సల్ టీజర్ కి గ‌తంలో 24 గంటల్లో 1.12కోట్ల వ్యూస్ వ‌చ్చాయి. అజ్ఞాత‌వాసి టీజ‌ర్ 24 గంటల్లో 4.12 లక్షల లైక్స్ రాబ‌ట్టి కొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా వ‌చ్చే నెల 10న విడుద‌ల కానుంది.

Share.

Leave A Reply

%d bloggers like this: