ద‌టీజ్ ర‌జ‌నీ.. షూటింగ్ 40 రోజులు.. రెమ్యూన‌రేష‌న్ 65 కోట్లు

0

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తమిళనాట మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా రజనీకాంత్‌ సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తాయి. రోబో తరువాత రజనీకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. రజనీ స్టైల్స్‌కు బాలీవుడ్‌లో కూడా ఫ్యాన్స్‌ ఉన్నారు. అందుకే రజనీకాంత్ సినిమాకు టాక్‌తో సంబంధం లేకుండా భారీగా కలెక్షన్లు వస్తుంటాయి. అందుకు తగ్గట్టుగా రజనీకాంత్ రెమ్యూనరేషన్‌ కూడా భారీగా అందుకుంటున్నాడు. ప్రస్తుతం కాలా, 2.ఓ సినిమాల రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్న తలైవా, త్వరలో యువ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. సన్‌ పిక్చర్స్‌ నిర్మించనున్న ఈ సినిమాకు రజనీకాంత్‌ 65 కోట్ల రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారట. కేవలం 40 రోజుల షూటింగ్‌కు గాను రజనీ ఈ మొత్తం అందుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతమందిస్తుండగా విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు.

Share.

Leave A Reply

%d bloggers like this: