ద‌ళిత బాలిక‌పై అత్యాచారం

0

చ‌ట్టాలు ఎన్ని ఉన్నా అత్యాచారాలు ఆగ‌డం లేదు. ముఖ్యంగా ద‌ళిత మ‌హిళ‌లపై ఈ దాడులు నిత్యం జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖ జిల్లాలోని పద్మనాభ మండలం రెడ్డిపల్లిలో ఇలాంటి దారుణం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని ఎనిమిదేళ్ల దళిత బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దళిత బాలికకు కళ్లబొల్లి మాటలు చెప్పి.. స్థానిక యువకుడు లైంగిక దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. గొర్రెల కాపరి అయిన నిందితుడు ఈశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం విశాఖపట్నంలోని కేజీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే అత్యాచార ఘటనను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.

Share.

Leave A Reply

%d bloggers like this: