ధ‌ర్మ‌వ‌రంలో బాంబుల క‌ల‌క‌లం

0

అనంతపురం జిల్లా ధ‌ర్మ‌వ‌రంలో బాంబులు కలకలం సృష్టించాయి. ధ‌ర్మ‌వ‌రం ప‌ట్ట‌ణంలోని బోయవీధి శివారులో శనివారం ఉదయం ఒక బాంబును గుర్తు తెలియని వ్య‌క్తులు విసరడంతో పేలి పెద్ద‌శ‌బ్దం వచ్చింది. దాంతో ఉలిక్కిపడిన పరిసరప్రాంత ప్రజలు పరుగులు తీశారు. ద‌ట్టంగా పొగ‌లు క‌మ్ముకోవ‌డంతో కాసేపు అమోమయం నెలకొంది. సమాచారం అందుకున్న‌ పోలీసులు సంఘటన స్థ‌లాన్ని పరిశీలించారు. బాంబు పేలిన ప్రాంతంలో తనిఖీ చేయగా పేలని మూడు బాంబులు దొరికాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. పెయింటర్‌ పనిచేస్తున్న చిన్న రాజాతో ఉన్న ఆస్తి గొడవల కారణంగా ఆయన సోదరులే పొగ బాంబులు వేశారని పోలీసుల విచారణలో తేలింది.

Share.

Leave A Reply

%d bloggers like this: