నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

0

కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో క‌ల‌క‌లం చెల‌రేగింది. కాలేజీ భ‌వ‌నంపై నుంచి దూకి ఓ విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్న‌ ఆ విద్యార్థిని చూసిన సిబ్బంది వెంట‌నే అత‌డిని ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ప్ప‌టి‌కీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఆ విద్యార్థి పేరు ర‌వి అని తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న‌ పోలీసులు ఆసుప‌త్రి వ‌ద్ద‌కు వ‌చ్చి కేసు న‌మోదు చేసుకున్నారు. ఆ విద్యార్థి ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ‌డానికి దారి తీసిన కార‌ణాల‌పై ఆరా తీస్తున్నారు.

Share.

Leave A Reply

%d bloggers like this: