నేడు కాలా ఆడియో విడుద‌ల‌

0

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణమిది. పా.రంజిత్‌ దర్శకత్వంలో ‘కబాలి’ అనంతరం రజనీకాంత్‌ నటించిన రెండో చిత్రం ‘కాలా’. ఈ సినిమా సింగిల్‌ ట్రాక్‌ను ఇటీవల ఆవిష్కరించారు. మొత్తం పాటలను బుధవారం విడుదల చేయనున్నారు. ఇందుకోసం పెద్ద స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి చెన్నై నగరంలోని నందనం వైఎంసీఏ మైదానం వేదిక కానుంది. మునుపెన్నడూ లేని విధంగా పెద్ద స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అందుకే మైదానాన్ని వేదికగా ఎంచుకుంది. రజనీకాంత్‌ రాజకీయ వేదికగా దీన్ని మలుచుకుంటారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇది పూర్తిస్థాయి సినిమా కార్యక్రమం మాత్రమేనని, పాటల ఆవిష్కరణకే ప్రాధాన్యత అని చిత్రవర్గాలు చెబుతున్నాయి. కానీ సూపర్‌స్టార్‌ రాజకీయపరమైన వ్యాఖ్యలు కూడా చేస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు, సినీ తారలు పలువురు పాల్గొననున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఏదేమైనప్పటికీ సందడి చేయడానికి రజనీకాంత్‌ అభిమానులు సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో మొత్తం తొమ్మిది పాటలు ఉన్నట్లు సమాచారం. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం సమకూర్చారు.

Share.

Leave A Reply

%d bloggers like this: