నేడు రాయ‌ల‌సీమ‌లో ఎండ తీవ్రం

0

రాయలసీమలో ఎండ తీవ్రత పెరిగింది. ప్రస్తుతం సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2-3 డిగ్రీలు అదనంగా నమోదవుతూ వస్తోంది. సోమవారం పలు ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. మరోపక్క మే 2, 3 తేదీల్లో కోస్తాంధ్ర జిల్లాలకు ఉరుములతో కూడిన వర్ష సూచన ఉన్న‌ట్లు వాతావరణశాఖ వెల్ల‌డించింది. ప్రస్తుతం తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ప్రత్యేకంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఈదురు గాలులు వీస్తాయని తెలియ‌జేసింది.

Share.

Leave A Reply

%d bloggers like this: