న్యాయం కోసం వ‌స్తే..అత్యాచారం చేసిన ఏఎస్ఐ

0

తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళపై అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ అత్యాచారం చేశాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. బాధితురాలు (30)తన వివాహం విషయంలో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించాలని ఢిల్లీలోని మియాన్ వాలీ పోలీస్ స్టేషన్ కు వచ్చింది. అక్కడ విధుల్లో ఉన్న ఏఎస్ఐ దిలీప్ సింగ్ (50) సమస్యను పరిష్కరిస్తానంటూ ఆమెకు మాట ఇచ్చాడు. తర్వాత సమస్య గురించి మాట్లాడదామంటూ బాధితురాలిని ఓ ఫ్లాటుకు రప్పించాడు. అనంతరం ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఈ దారుణంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫ్లాట్ కు వచ్చినట్టు సీసీటీవీ ఫుటేజీలో తేలింది. అంతేకాదు ఆమెపై అత్యాచారం జరిగినట్టు వైద్య పరీక్షలో కూడా నిరూపితమైంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఢిల్లీ డీసీపీ ఎంఎన్ తివారీ మాట్లాడుతూ ఏఎస్ఐ దిలీస్ సింగ్ ను డిస్మిస్ చేశామని తెలిపారు.

Share.

Leave A Reply

%d bloggers like this: