న‌వంబ‌ర్ 15న దేశవ్యాప్త స‌మ్మె

0

కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నవంబరు 15న ఒకరోజు దేశవ్యాప్త సమ్మె చేయాలని నిర్ణయించారు. ముందస్తు ఆందోళనల్లో భాగంగా జులై మొదటి వారం నుంచి అక్టోబరు 30 వరకు అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు సిద్ధం కానున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన అఖిల భారత కేంద్ర ప్రభుత్యోద్యోగుల సమాఖ్య (ఏఐసీజీఈఎఫ్‌) జాతీయ సమావేశంలో ఈ మేరకు తీర్మానాలు జరిగాయి. సమాఖ్య జాతీయ అధ్యక్షుడు కేకే ఎన్‌ కుట్టి, జి.సంజీవ రెడ్డి, అమర్‌జీత్‌ కౌర్‌, చుక్కా రాములు, శ్రీకుమార్‌ తదితరులు కేంద్రం విధానాలపై ధ్వజమెత్తారు. కనీస వేతన పెంపు, ఎంఏసీపీ బెంచ్‌మార్క్‌, తదితర ప్రధానాంశాలు గత కొన్నేళ్ళుగా కేంద్రం వద్దే మూలుగుతున్నప్పటికీ అధినేతలు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మె నిర్వహించేందుకు ఉద్యోగులు సిద్ధమైనప్పటికీ 2016లో కేంద్రం హామీ ఇచ్చిన నేపఽథ్యంలోనే ఉద్యోగులు సమ్మెను విరమించుకున్నారని వెల్లడించారు. అయినాప్రభుత్వం హామీని నిలబెట్టుకోకపోవడంతో ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందని పేర్కొన్నారు.

Share.

Leave A Reply

%d bloggers like this: