పాక్‌లో ఖ‌రీదైన పెళ్లి..జ‌నంపైకి డ‌బ్బుల వ‌ర్షం

0

సౌదీ అరేబియా, అమెరికాల‌కు వెళ్లి పెద్ద‌మొత్తంలో డ‌బ్బు సంపాదించి స్థిర‌ప‌డే వాళ్ల‌ను చూస్తూనే ఉంటాం. పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రం ముల్తాన్ ప్రాంతానికి చెందిన మ‌హ్మ‌ద్ అర్షాద్ కుటుంబీకులు కూడా అలాగే వెళ్లి డ‌బ్బు సంపాదించారు. ఇటీవ‌ల అక్క‌డి ఖాన్‌పూర్‌లోని మ‌హిళ‌తో మ‌హ్మ‌ద్ అర్షాద్‌కు వివాహం జ‌రిగింది. ఆ వివాహంలో అత‌ని కుటుంబీకులు చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. పెళ్లికి వ‌చ్చిన అతిథుల మీద‌, పెళ్లి జ‌రిగిన ఊర్లో డ‌బ్బులు, సెల్‌ఫోన్ల వ‌ర్షం కురిపించారు. మ‌హ్మ‌ద్ అర్షాద్‌కి ఏడుగురు సోద‌రులు ఉన్నారు. వారిలో న‌లుగురు అమెరికాలో, ముగ్గురు సౌదీలో స్థిర‌ప‌డి కోకొల్ల‌లుగా సంపాదించారు. దీంతో త‌మ్ముడి వివాహాన్ని ఘ‌నంగా, ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా చేయాల‌ని వారు నిర్ణ‌యించుకున్నారు. అందుకే వ‌ధువు ఊర్లోకి అడుగుపెడుతూనే బ‌స్సు మీద నుంచి డాల‌ర్లు, సౌదీ అరేబియా క‌రెన్సీ రియాల్స్‌, సెల్‌ఫోన్లు విసిరేశారు. త‌ర్వాత పెళ్లి కూతురి ఇంటి ముందు ఏర్పాటు చేసిన స్టేజీ మీద నిల‌బ‌డి డ‌బ్బులు, బ‌హుమ‌తులు ఎగ‌ర‌వేశారు. దీంతో వాటిని ఏరుకోవ‌డానికి అక్క‌డి ప్ర‌జ‌లు ఎగ‌బ‌డ్డారు. ఈ డాల‌ర్ల వ‌ర్షానికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Share.

Leave A Reply

%d bloggers like this: