పొట్టి దుస్తులు వేసుకుంద‌ని అత్యాచారం..!

0

గత వారం లెబనాన్ రాజధాని బీరట్‌లో అత్యాచారం అనంతరం దారుణహత్యకు గురైన బ్రిటీష్ మహిళా దౌత్యవేత్త కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పొట్టి దుస్తులు వేసుకోవడంతో అత్యాచారం చేయడానికి కష్టం కాలేదంటూ విచారణలో నిందితుడు పలు విషయాలను వెల్లడించాడు. బీరట్ పోలీసుల కథనం ప్రకారం.. రెబెక్కా డైక్స్(30) అనే బ్రిటీష్ మహిళ లెబనాన్ లో దౌత్యవేత్తగా సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో గతవారం బీరట్ లోని ఫేమస్ టూరిస్ట్ బార్ నుంచి రెబెక్కా బయటకొచ్చారు. ఇంటికి వెళ్లేందుకు ఉబర్ క్యాబ్ బుక్ చేశారు. క్యాబ్ ఎక్కే సమయంలోనే డ్రైవర్ తరీక్ హచీహ్, రెబెక్కా వస్త్రధారణను గమనించాడు. కొద్దిసేపు క్యాబ్ నడిపాక నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు నిందితుడు. అక్కడ రెబెక్కాపై అత్యాచారం చేసి, ఉరివేసి హత్య చేశాడు. అనంతరం రోడ్డ పక్కన పొదల్లో ఆమె మృతదేహాన్ని వదిలివెళ్లాడు. కొందరు స్థానికులు మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులకు సమచారం అందించారు. రెబెక్కా మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజీతో పాటు మొబైల్‌లో ఉబర్ క్యాబ్ బుక్ చేసిన సమాచారాన్ని పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. రెబెక్కా చాలా అందంగా ఉందని, అందులోనూ ఆమె పొట్టి దుస్తులు (మిని స్కర్ట్) వేసుకోవడంతో అత్యాచారం చేశానని పోలీసుల విచారణలో నిందితుడు వెల్లడించాడు. క్యాబ్ డ్రైవర్ అయినప్పటికీ తరీక్ వద్ద ఆయుధాలు (తుపాకులు) ఉన్నాయని, నిందితుడ్ని మరిన్ని కోణాల్లో విచారించనున్నట్లు బీరట్ పోలీసులు వివరించారు.

Share.

Leave A Reply

%d bloggers like this: