ప్రాణం ఉన్నంత వరకు దావూద్ వెంటే : ఛోటా షకీల్

0

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో విభేదాల నేపథ్యంలో, ఆయనకు దూరంగా ఛోటా షకీల్ ఉంటున్నాడనే వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. దావూద్ తో మాట్లాడటానికి కూడా షకీల్ ఇష్టపడటం లేదని… కరాచీలో విడిగా ఉంటున్నాడని వార్తలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై ఛోటా షకీల్ స్పందించాడు. దావూద్ భాయ్ తో తనకు విభేదాలు లేవని, తుది శ్వాస ఉన్నంత వరకు ఆయన వెంటే ఉంటానని చెప్పాడు. ఈ వార్తలన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశాడు. గుర్తు తెలియని ప్రాంతం నుంచి జీ న్యూస్ కు ఈ విషయాన్ని తెలిపాడు. భాయ్ తో తాను ఎప్పటిలాగే ఉన్నానని, ఇక ముందు కూడా ఇలాగే ఉంటానని చెప్పాడు.

Share.

Leave A Reply

%d bloggers like this: