ప్రేమించ‌లేద‌ని కిరోసిన్ పోసి నిప్పంటించిన ఉన్మాది

0

– చావుబ‌తుకుల్లో బాధితురాలు
– పోలీసుల‌కు లొంగిపోయిన నిందితుడు
– హైద‌రాబాద్‌లో ఘాతుకం
చిన్నతనంలోనే చనిపోయిన తండ్రి.. వివాహమైనా ఇంట్లోనే ఉంటున్న అక్కలు.. తల్లితోపాటు తనపైనే పడిన కుటుంబ పోషణ భారం.. ఈ పరిస్థితుల మధ్య చిరుద్యోగంతో నెట్టుకొస్తున్న ఆ యువతి మనసు ప్రేమవైపు మళ్లలేదు. దీంతో ప్రేమ పేరుతో ఆమె వెంట పడుతున్న ఉన్మాది కక్ష కట్టాడు. పథకం ప్రకారం ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పుపెట్టాడు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ఉన్మాది స్వయంగా వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. హైద‌రాబాద్ నగరంలోని ఉత్తర మండల పరిధిలో ఉన్న లాలాపేట్‌లో గురువారం సాయంత్రం ఈ ఘోరం చోటు చేసుకుంది. 80 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది.
చిన్నతనంలోనే కుటుంబ బాధ్యతలు..
లాలాపేట్‌ భజన సమాజం ప్రాంతంలో నివసించే నిరేటి సంధ్యారాణి(23) తండ్రి దాసు చిన్నతనంలోనే చనిపోయారు. ముగ్గురు సోదరులకు వివాహాలై వేరే ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఇద్దరు అక్కలకు పెళ్లిళ్లు అయినప్పటికీ అనివార్య కారణాలతో వారు పుట్టింట్లోనే ఉంటున్నారు. తల్లి సావిత్రితో పాటు అక్కల బాధ్యత సంధ్యారాణి తీసుకుంది. డిగ్రీ పూర్తి చేసిన ఆమె శాంతినగర్‌ చౌరస్తాలోని లక్కీ ట్రేడర్స్‌ అనే అల్యూమినియం డోర్స్, విండోస్‌ తయారు చేసే సంస్థలో అకౌంటెంట్‌గా పని చేస్తోంది. తన జీతంతో కుటుంబాన్ని పోషిస్తూ పెద్దదిక్కు అయ్యింది. కాగా, లాలాపేట్‌లోని ఈదమ్మగుడి ప్రాంతంలో సంధ్యారాణి స్నేహితురాలు నివసిస్తోంది. అప్పుడప్పుడు అక్కడికి వెళ్లే సంధ్యారాణికి స్నేహితురాలి సోదరుడు కార్తీక్‌(25)తో పరిచయమైంది. అత‌డే ఈ ఘాతుకానికి ఒడిగ‌ట్టాడు.

Share.

Leave A Reply

%d bloggers like this: