ప్రేమ‌జంట‌ను బెదిరించి..యువ‌తిపై అత్యాచారం

0

జగిత్యాల జిల్లాలో కామాంధులు దారుణానికి పాల్ప‌డ్డారు. ప్రేమికుడితో కలిసి వెళ్తున్న యువతిని బెదిరించి అత్యాచారం చేశారు. అడ్డుకోబోయిన ప్రియుడిని చితకబాదారు. జగిత్యాల హుస్నాబాద్‌కు చెందిన ప్రేమికులు బైక్‌పై వెల్లడాన్ని అదే గ్రామానికి చెందిన వంశీ, రాజష్‌లతోపాటు మరో యువకుడు వీడియో తీశారు. తమకు లొంగకపోతే వీడియోని ఇంటర్నెట్లో పెడతామంటూ బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. వారి వద్దనున్న సెల్‌ఫోన్‌, నగదును లాక్కున్నారు. ఇంటికి చేరుకున్న యువతి జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులు, బంధువులకు తెలిపింది. గ్రామస్తులు, స్థానికులు ముగ్గురిలో ఇద్దరిని పట్టుకొని నడిరోడ్డుపై కట్టేసి చితక బాదారు. మరొకరు పరారీలో ఉన్నారు. యువతి పరువు పోతుందనే కారణంగా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని కుటుంబసభ్యులు తెలిపారు.

Share.

Leave A Reply

%d bloggers like this: