ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య‌

0

వ‌న‌ప‌ర్తి జిల్లాలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన చోటుచేసుకుంది. కొత్తకోట మండలం అప్పరాళ్ల గ్రామానికి చెందిన విక్రమ్, సుస్మిత అనే ఇరువురు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే… వీరి ప్రేమకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ప్రియురాలు సుస్మిత పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇది తెలిసిన ప్రియుడు విక్రమ్ శ్రీరాంనగర్ దగ్గర రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమికులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Share.

Leave A Reply

%d bloggers like this: