ప్ర‌తిదీ అపురూప‌మే.. అనుష్క‌

0

‘సరైన సినిమా ఒక్కటి పడిందంటే చాలు… జీవితమే మారిపోతుంద’నే మాట చిత్రసీమలో తరచుగా వినిపిస్తుంటుంది. నటుల కెరీర్‌ని పరిశీలిస్తే నిజంగానే వాళ్ల జీవితాల్ని మలుపు తిప్పిన కొన్ని చిత్రాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. మరి మీ జీవితంలో అలాంటి చిత్రమేదంటే ఏం చెబుతారని అనుష్కని అడిగితే ఆమె భిన్నమైన సమాధానం చెప్పింది. ‘‘నేనైతే ప్రత్యేకంగా ఒక సినిమా అని చెప్పలేను. అందరిలాగే నా కెరీర్‌లోనూ విజయాలున్నాయి, పరాజయాలున్నాయి. కానీ నా జీవితంలో ప్రతి సినిమా ముఖ్యమైనదే. విజయాలతో ఎంత నేర్చుకొన్నానో, పరాజయాలూ అంతే నేర్పించాయి. అందుకే కెరీర్‌ పరంగా క్రెడిట్‌ ఇవ్వమంటే నేను చేసిన అన్ని సినిమాలకీ, అందరు దర్శకులకీ భాగం పంచుతా. ఒక గొప్ప పాత్రలో నేను కనిపించానంటే… అందులో ఒదిగిపోవడానికి నేను సంపాదించిన అనుభవం, మొదటి నుంచి నేను నేర్చుకొన్న విషయాలు దోహదం చేసుంటాయనే అర్థం. అందుకే నాకు ఎలాంటి ఫలితాన్నివ్వని సినిమా కూడా నాకు అపురూపమైనదే’’ అని చెప్పుకొచ్చింది అనుష్క. వచ్చే యేడాది ఆమె ‘భాగ్‌మతి’గా సందడి చేయబోతున్నారు. ఈమధ్య కాస్త బొద్దుగా మారిన అనుష్క మళ్లీ మునుపటిలా నాజూగ్గా తయారయ్యే పనిలో ఉన్నారు.

Share.

Leave A Reply

%d bloggers like this: