ప్ర‌యాణికుల‌కు ఫ్రీ కౌగిలింత‌

0

కోల్‌క‌తాలో ఇద్దరు దంపతులు మెట్రో రైల్లో కౌగిలించుకున్నారని కొంతమంది తోటి ప్రయాణికులు వారిని చితకబాదిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కేవలం కౌగిలించుకుంటేనే దాడి చేస్తారా అని ప్రశ్నిస్తూ.. దాడికి గురైన దంపతులకు మద్దతుగా కొంతమంది యువత బుధవారం కోల్‌కత్తాలోని దమ్‌ దమ్‌ మెట్రో స్టేషన్‌ బయట ఫ్రీ హగ్స్‌ పేరిట ప్రయాణికులకు ఆలింగనం చేసుకున్నారు. మెట్రోలో కౌగిలించుకున్నారని దంపతులపై దాడి చేసిన వారిపై నిరసన తెలియజేస్తూ ఈ విధంగా విన్నూత నిరసన చేపట్టారు. కౌగిలింత అనేది తప్పేంకాదని అది ప్రేమానుబంధాలకు ప్రతీక అని నిరసన చేస్తున్న యువత అన్నారు. సామాజిక మాధ్యమాల్లో కూడా దాడి చేసిన వారిపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. ఫ్రీ హగ్‌ హ్యాష్‌ ట్యాగ్‌ కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.                                                                    ఫొటో విష‌యం.. దంప‌తుల‌కు మ‌ద్ద‌తుగా నిర‌స‌న‌లో భాగంగా ఓ ప్ర‌యాణికుడికి హ‌గ్ ఇస్తున్న యువ‌తి

Share.

Leave A Reply

%d bloggers like this: