బాబా భ‌య్యూజీ ఆత్మ‌హ‌త్య‌

0

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో వివాదాస్పద స్పిరిచ్యువల్‌ గురూ భయ్యూజీ మహారాజ్‌ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆశ్రమంలో తుపాకీతో కాల్చుకుని ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. తుపాకీ శబ్దంతో షాక్‌కు గురైన ఆయన శిష్యులు భయ్యూజీ గదిలోకి వెళ్లి చూడగా ఆయన రక్తపు మడుగులో పడి ఉన్నారు. దీంతో హుటాహుటిన స్వామిజీను ఇండోర్‌ బాంబే ఆసుపత్రికి తరలించారు. భయ్యూజీని పరీక్షించిన వైద్యులు ఆయన మరణించినట్లు ధ్రువీకరించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో భయ్యూజీకి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం మంత్రి పదవిని ఆఫర్‌ చేసింది. అయితే, దాన్ని భయ్యూజీ తిరస్కరించారు. ప్రజలకు చేరువయ్యేందుకు పదవులు అవసరం లేదని పేర్కొన్నారు భయ్యూజీ. కాగా భయ్యూజీ గత కొంతకాలంగా తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి.

Share.

Leave A Reply

%d bloggers like this: