బాబు ఆస్తుల్లో కొసమెరుపులు

0

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ బాబు తమ కుటుంబానికి సంబంధించి చేసిన ఆస్తుల ప్రకటనలో కొన్ని వివరాలు ఆసక్తిదాయకంగా మారాయి. ప్రతియేటా ఎవరూ అడగకపోయినా ఆస్తుల ప్రకటన చేస్తోంది నారా కుటుంబం. ఈ క్రమంలో తాజాగా లోకేష్ ప్రకటించిన ఆస్తుల్లో కొన్ని కొసమెరుపులు ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు పేరు మీద ఉన్న ఆస్తుల విలువ, ఆయనకు ఉన్న అప్పులు విలువ.. ఈ రెండూ ముఖ్యమైనవి.లోకేష్ వెల్లడించిన లెక్కల ప్రకారం.. ఏపీ సీఎం పేరిట ఉన్న ఆస్తుల విలువ, మొత్తం అప్పు విలువ దాదాపు సరి సమానంగా ఉంది. తన తండ్రి చంద్రబాబు పేరిట నాలుగు కోట్ల రూపాయల స్థిరాస్తులు ఉన్నాయని లోకేష్ ప్రకటించారు. అయితే.. ఆయన పేరిటే 3.58 కోట్ల రూపాయల అప్పులున్నాయని లోకేష్ ప్రకటించడం విశేషం.చంద్రబాబు స్థిరాస్తికి, అప్పుకు ఉన్న వ్యత్యాసం కేవలం నలభై లక్షల రూపాయల చిల్లరే కావడం విశేషమైన అంశం. దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న బాబుకు ఆస్తులకు, అప్పులకు పెద్ద వ్యత్యాసం లేకపోవడం.. చర్చనీయాంశం అవుతోంది.మరి బాబు పేరిట అప్పులు, ఆస్తులు దాదాపు సరి సమానంగా ఉండగా.. ఆయన మనవడి పేరుపై మాత్రం ఆస్తులు గట్టిగానే ఉన్నాయి. దేవాన్ష్ పేరిట 11 కోట్ల రూపాయల పై స్థాయి ఆస్తులనే చూపారు లోకేష్.

Share.

Leave A Reply

%d bloggers like this: