బ‌న్నీ న్యూ ఇయ‌ర్ గిఫ్ట్‌

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా పేరు సూర్య. నా ఇళ్లు ఇండియా అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను లగడపాటి శ్రీధర్, బన్నీ వాస్ లు నిర్మిస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సైనికుడిగా నటిస్తున్నాడు. సీనియర్ నటుడు అర్జున్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 27న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను జనవరి 1న ప్రారంభించనున్నారు చిత్రయూనిట్. న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమాతో ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని బన్నీ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకులు విశాల్ శేఖర్ స్వరాలందిస్తున్నారు.

Share.

Leave A Reply

%d bloggers like this: