భార‌త్ విజ‌య‌ఢంకా

0

– సిరీస్ కైవ‌సం
– రికార్డు సెంచ‌రీతో చెల‌రేగిన రోహిత్‌
బౌండరీలు కొట్టడం ఇంత తేలికా… సిక్స్‌లు బాదడం మరీ సులువా…రోహిత్‌శర్మ బ్యాటింగ్‌ చూస్తే అదే అనిపించింది. అడ్డుకట్టే వేయలేనంతగా పరుగుల వరద పారించి తననెందుకు హిట్‌మ్యాన్‌ అంటారో మరోసారి చాటిచెప్పాడు…ఇప్పటికే మూడు వన్డే ద్విశతకాలతో బౌలర్ల పాలిట సింహస్వప్నంగా మారిన రోహిత్‌… ఈ సారి టి20లో తడాఖా చూపాడు. సెంచరీని మంచినీళ్ల ప్రాయంలా అందుకున్నాడు. వైడ్‌ యార్కర్, లో ఫుల్‌ టాస్‌ ఇలా బంతి ఏ విధంగా వచ్చినా బౌండరీనే నీ చిరునామా అంటూ చెలరేగిపోయాడు. ప్రపంచ రికార్డుతో భారత క్రికెట్‌ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని లిఖించుకున్నాడు. అలాగే ఇండోర్‌లో జ‌రిగిన ఈ గెలుపుతో భార‌త్ సిరీస్‌ను గెలుచుకుంది.
కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (43 బంతుల్లో 118; 12 ఫోర్లు, 10 సిక్స్‌లు) మరోసారి వీర విహారం చేశాడు. ఇండోర్‌లో శ్రీలంకతో శుక్రవారం జరిగిన రెండో టి20లో బౌలర్లను అలవోకగా ఆడేసుకున్నాడు. తన ఊచకోతతో టి20ల్లో వేగవంతమైన శతకం (35 బంతుల్లో) రికార్డును సమం చేశాడు. అతడి జోరుకు రాహుల్‌ (49 బంతుల్లో 89; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) తోడవడంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 260 పరుగులు చేసింది. భారత్‌కు టి20ల్లో ఇదే అత్యధిక స్కోర్‌ కావడం విశేషం. కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనకు బరిలో దిగిన లంక 17.2 ఓవర్లలో 172 పరుగులే చేసి 88 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2–0తో సిరీస్‌ భారత్‌ సొంతమయ్యింది.
ఆగని దూకుడు…
వన్డే సిరీస్‌ తొలి మ్యాచ్‌లో విఫలమై రెండో మ్యాచ్‌లో ఏకంగా డబుల్‌ సెంచరీతో అదరగొట్టిన హిట్‌మ్యాన్‌… దానిని టి20 సిరీస్‌లోనూ పునరావృతం చేశాడు. కటక్‌లో రాణించలేకపోయినప్పటికీ ఇండోర్‌లో విశ్వరూపం చూపాడు. తొలి ఓవర్లో రెండు బౌండరీలు కొట్టి టచ్‌లోకి వచ్చిన రోహిత్‌ అయిదో ఓవర్‌లో సిక్స్‌తో లయందుకున్నాడు. ఆరో ఓవర్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో గేరు మార్చాడు. అప్పటిదాకా తనకంటే పరుగుల్లో ముందున్న రాహుల్‌ను వెనక్కునెట్టాడు. గుణరత్నే వేసిన తొమ్మిది ఓవర్లో సిక్స్‌తో అర్ధశతకం (23 బంతుల్లో) దాటిన రోహిత్‌.. తర్వాత మరో సిక్స్, రెండు ఫోర్లతో 20 పరుగులు పిండుకున్నాడు. పెరీరా బౌలింగ్‌లో (11వ ఓవర్‌) ఏకంగా నాలుగు సిక్స్‌లు కొట్టి 97కు చేరుకున్నాడు. 12వ ఓవర్‌ రెండో బంతిని బౌండరీకి పంపి టి20ల్లో వేగవంతమైన శతకం (35 బంతుల్లో) రికార్డును సమం చేశాడు. కండరాలు పట్టేసి మాథ్యూస్‌ వైదొలగడంతో ఈ ఓవర్‌ మిగతా నాలుగు బంతులను వేసిన ధనంజయ ఒక్క పరుగే ఇచ్చి కట్టడి చేశాడు. తర్వాతి 13వ ఓవర్‌లో ఊపు కొనసాగించిన రోహిత్‌ సిక్స్, ఫోర్, సిక్స్‌తో టి20ల్లో తొలి ద్విశతకం చేస్తాడేమో అనిపించాడు. కానీ.. స్లో బౌన్సర్‌ను థర్డ్‌మ్యాన్‌ దిశగా పంపే యత్నంలో విఫలమై క్యాచ్‌ ఇచ్చాడు. తొలి వికెట్‌కు వీరిద్దరి భాగస్వామ్యం 165. ఇది టి20ల్లో భారత్‌కు అత్యుత్తమం కావడం విశేషం. మరో వైపు భారత ఇన్నిగ్స్‌లో రాహుల్‌ ఆట కూడా హైలైట్‌. రోహిత్‌ విజృంభణలో అతడి ప్రదర్శన వెనుకబడిపోయింది కానీ తొలి సిక్స్‌తో జోరు మొదలు పెట్టింది రాహులే. అయిదు ఓవర్లు ముగిసేసరికి భారత్‌ స్కోరు 43 అయితే అందులో రాహుల్‌వే 26 పరుగులు ఉన్నాయి. 8వ ఓవర్‌ వరకు కెప్టెన్‌తో సమానంగా పరుగులు సాధించాడు. 15వ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో జోరు పెంచాడు. తర్వాత మరో నాలుగు సిక్స్‌లు కొట్టి… సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ డిక్‌వెలా పట్టిన అద్భుతమైన క్యాచ్‌తో అవుటయ్యాడు.
వన్‌డౌన్‌లో ధోని…
రోహిత్‌ వెనుదిరిగాక అనూహ్యంగా వన్‌డౌన్‌లో వచ్చిన ధోని (21 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాహుల్‌కు జత కలిశాడు. 14వ ఓవర్‌ తొలి రెండు బంతులను బౌండరీలు బాదాడు. మధ్యలో కొంత తగ్గినా… స్పిన్నర్‌ ధనంజయ వేసిన 17వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు కొట్టాడు. రాహుల్‌తో కలిసి రెండో వికెట్‌కు 78 పరుగులు జత చేశాడు. స్కోరును మరింత పెంచే ఉద్దేశంతో హార్దిక్‌ పాండ్యా (10)ను నాలుగో స్థానంలో పంపారు. సిక్స్, ఫోర్‌తో హిట్టింగే లక్ష్యంగా కనిపించిన పాండ్యా 19వ ఓవర్‌ చివరి బంతికి వెనుదిరిగాడు. చివరి ఓవర్లో శ్రేయస్‌అయ్యర్‌ (0) విఫలం కాగా… మనీశ్‌ పాండే (1), కార్తీక్‌ (5) నాటౌట్‌గా మిగిలారు.
లంక దీటుగా…
ఎదురుగా కొండంత స్కోరు… బంతికి రెండు పరుగులపైగా చేస్తేనే గెలుపు అవకాశం… ప్రత్యర్థి బౌలర్లలో చేయి తిరిగిన స్పిన్నర్లు. అయినా లంక దీటుగానే బదులిచ్చింది. ఓపెనర్లు డిక్‌వెలా (19 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్‌), తరంగ (29 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా మొదలుపెట్టారు. తొలి వికెట్‌కు 36 పరుగులు జోడించాక డిక్‌వెలా… ఉనాద్కట్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అనంతరం వచ్చిన కుషాల్‌ పెరీరా (37 బంతుల్లో 77; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగాడు. తరంగతో కలిసి రెండో వికెట్‌కు 53 బంతుల్లోనే 109 పరుగులు జత చేశారు. వీరి జోరు కొంత కలవరపెట్టినా తరంగను చహల్‌ వెనక్కు పంపాక లంక కుప్పకూలింది. కుల్దీప్‌ బౌలింగ్‌లో పాండే క్యాచ్‌ పట్టడంతో మరో 10 పరుగుల్లోపే పెరీరా కూడా అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 155/3. మిగతా 7 వికెట్లను 17 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. భారత బౌలర్లలో చహల్‌ (4/52), కుల్డీప్‌ (3/52) రాణించారు.
అంతర్జాతీయ టి20ల్లో ఇదే (35 బంతుల్లో) ఫాస్టెస్ట్‌ సెంచరీ.ఇటీవలే బంగ్లాదేశ్‌పై డేవిడ్‌ మిల్లర్‌ (దక్షిణాఫ్రికా) కూడా 35 బంతుల్లోనే శతకం సాధించాడు. టి20ల్లో భారత్‌కు ఇదే (260/5) అత్యధిక స్కోరు. అంతర్జాతీయ టి20ల్లో రోహిత్‌కు ఇది రెండో సెంచరీ. గతంలో నలుగురు ఆటగాళ్లు (గేల్, మెకల్లమ్, ఎవిన్‌ లూయీస్, కొలిన్‌ మున్రో) మాత్రమే రెండేసి సెంచరీలు సాధించారు. రోహిత్‌ ఇన్నింగ్స్‌లో బౌండరీల ద్వారా వచ్చిన పరుగుల శాతం.రోహిత్‌ ఈ ఏడాది అన్ని ఫార్మాట్‌లలో కలిపి బాదిన సిక్సర్లు. ఒక సంవత్సరంలో ఏ బ్యాట్స్‌మన్‌కైనా ఇదే అత్యధికంరోహిత్, రాహుల్‌ కలిసి చేసిన పరుగులు. ఒక జట్టులో ఇద్దరు ఓపెనర్లు కలిపి చేసిన అత్యధిక మొత్తం ఇదే. ఒక ఇన్నింగ్స్‌లో జట్టు కొట్టిన సిక్సర్లు. వెస్టిండీస్‌ (21) రికార్డు సమమైంది.

Share.

Leave A Reply

%d bloggers like this: