భ‌క్తుల‌తో తిరుమ‌ల కిట‌కిట‌

0

పాఠశాలలకు వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలోని శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో స్థానికంగా విపరీతమైనరద్దీ నెలకొంది. తిరుపతిలోని రైల్వేస్టేషన్‌, బస్టాండు ప్రాంగణం, అలిపిరి టోల్‌గేట్‌కేంద్రం సహా పలు ప్రాంతాలు ప్రస్తుతం యాత్రికులతో కిటకిటలాడుతున్నాయి. వివిధ ప్రయాణ ప్రాంగణాలు, రహదారులతో పాటు ఖాళీ జాగాల్లోనే అర్ధరాత్రి వేళల్లో నిద్రకు ఉపక్రమిస్తున్నారు.
శ్రీవారికి రూ.కోటి విరాళం:
శ్రీవారికి ఓ భక్తుడు రూ.కోటి విరాళాన్ని ఆదివారం సమర్పించారు. కోల్‌కతాకు చెందిన వివేక్‌ గుప్తా తిరుమలలోని దాతల విభాగంలో డీడీలను అందజేశారు. శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టు కింద ఈ మొత్తాన్ని డిపాజిట్‌ చేయాలని కోరారు.

Share.

Leave A Reply

%d bloggers like this: